యూధులు ఇస్లాం మరియు దైవప్రవక్త(స.అ) పట్ల ఎందుకు తమ వ్యతిరేకతను చూపిస్తారు అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

యూధులు ఇస్లాం మరియు దైవప్రవక్త(స.అ) పట్ల ఎందుకు తమ వ్యతిరేకతను చూపిస్తారు అన్న విషయం ఖుర్ఆన్ పలు చోట్లలో సూచిస్తుంది. వాటిని వివరంగా తెలుసుకుందాం.
1. ఈర్ష్య: ఈర్ష్య మతభ్రష్టతకు కారణాల నుండి ఒకటి. ఇమామ్ సాదిఖ్(అ.స) అవిశ్వాసానికి మూలం ఈర్ష్య అని సూచించారు. వారు ఇలా ప్రవచించారు: “మీరు అసూయ మరియు ఈర్ష్య పడకండి; ఎందుకంటే అవిశ్వాసం యొక్క మూలం ఈర్ష్య కాబట్టి”[1]
ఖుర్ఆన్ దీని గురించి ఇలా ఉపదేశించెను: “ఈ గ్రంథవహుల్లోని అనేకులు, సత్యమేదో స్పష్టంగా తెలిసి పోయినప్పటికీ – కేవలం తమ మనసులతో ఉన్న అసూయ మూలంగా మిమ్మల్ని కూడా విశ్వాసం మార్గం నుంచి అవిశ్వాసం వైపు మళ్లించాలని చూస్తున్నారు.[2]
గుంథవహుల్లో చాలా మంది ముఖ్యంగా యూదులు ఇస్లాం ను అంగీరంచడపోవడంతో పాటు విశ్వాసులను తమ విశ్వాసాల నుండి మరలించాలి అనే విషయంపై పట్టుబడి ఉన్నారు మరి ఇది వారి ఈర్ష్య పై నిదర్శనం.[3]
ఈ ఈర్ష్యకు కారణం, ఇంతకు ముందు అవతరించబడిన ప్రవక్తలు మరియు దౌత్యం వారి నుండి ఉండేవారు కాని దైవప్రవక్త(స.అ) యొక్క దౌత్య ఎన్నికతో ఈ గౌరవం వారి నుండి తీసుకోబడింది మరో వైపు వారు అధికార స్థానాన్ని పోగొట్టుకున్నారు[4]
దైవప్రవక్త(స.అ) యొక్క దౌత్య ఎన్నికకు ముందు, యూదులు, ఇప్పుడు వచ్చే అవతరించే దైవప్రవక్త, భవిష్యత్తులో సమాజాన్ని పాలించే ప్రవక్త మరియు వారి నీడలో వీళ్లు ఉంటారు అని భావించారు; అందుకే అవిశ్వాసులతో త్వరలోనే అంతిమ దైవప్రవక్త అంగీకారంతో మేము మీ పై విజయాన్ని సాదిస్తాము అని చెప్పేవారు. వాళ్లు మదీనహ్ లోనే ఉండడానికి కారణాలలో ఒకటి ప్రవక్త హిజ్రత్ చేయు పట్టణం మదీనహ్ అని. దీని గురించే ఖుర్ఆన్ ఇలా ఉపదేశిస్తుంది: “వారి వద్ద (ముందు నుంచే) ఉన్న దైవగ్రంథాన్ని ధృవీకరించే గ్రంథం అల్లాహ్ వద్ద నుంచి వచ్చినప్పుడు, తెలిసి కూడా వారు దానిని తిరస్కరించసాగారు – మరి చూడబోతే దీని రాకకు మునుపు తమకు అవిశ్వాసుల పై విజయం చేకూరాలని వారు స్వయంగా అభిలషించేవారు. ఇటువంటి తిరస్కారుల పై అల్లాహ్ శాపం పడుగాక![5]
కాని దైవప్రవక్త(స.అ) అవతరించబడిన తరువాత వారిలో తౌరాత్ గ్రంథంలో చెప్పబడిన సంకేతాలు కనబడినప్పటికీ వారి ఆశలకు అనుకూలంగా లేనందుకు వారి పట్ల ఈర్ష్య కలిగి వారిని వ్యతిరేకించారు.
2. భౌతిక లాభాలు: యూదులు సత్యాన్ని అంగీకరించకపోవడానికి మరో కారణం భౌతిక లాభాలు. ఖుర్ఆన్ యూదులను ఉద్దేశించి ఇలా ప్రవచిస్తుంది.. ..భాతిక లాభాల కోసం, నిజాలను దాచకండి మరియు నా చిహ్నాలను మరియు ఆయాతులను కొద్దిపాటి ధరకు అమ్మేయకండి. ఖుర్ఆన్: “మీ వద్దనున్న గ్రంథాలకు ధృవీకరణగా నేను అవతరింపజేసిన ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) విశ్వసించండి. దీని పట్ల అందరికంటే ముందు మీరే తిరస్కారులు కాకండి. ఇంకా నా ఆయతులను కొద్దిపాటి ధరకు అమ్ముకోకండి. నాకు మాత్రమే భయపడండి.[6]
యూదుల అధికారులకు మరియు విజ్ఞానులకు తౌరాత్ గురించి బాగా తెలుసు వాళ్లు దాని గురించి జ్ఞానం కలిగి ఉన్నారు కాని తమ లాభాల కోసం తౌరాత్ యొక్క కొన్ని ఆయతులు మరియు విజ్ఞానాన్ని దాచిపెట్టేవారు కొన్నింటిని అయితే సంపూర్ణ అవిశ్వసంతో వాటిని మార్చేసేవారు. వాళ్లు తమ స్థానం మరియు స్థాయి తమ జాతి ముందు పోకూడదని, భౌతిక లాభాలు పొందాలని తామే సృష్టంచిన వాక్యలను తమ చేతులతో లిఖించి వాటిని దైవ వాక్యంగా ప్రదర్శించేవారు. వీళ్ల ఈ వ్యాపారం చాలా నీఛమైనది అని ఖుర్ఆన్ కూడా ప్రకటించింది.[7]
3. మనోవాంఛలకు లోబడి ఉండడం: “... అయితే ఏ ప్రవక్త అయినా మీ మనసులకు నచ్చని విషయాలు మీ వద్దకు తెచ్చినప్పుడల్లా మీరు అహంకారం ప్రదర్శించారు. వారిలో కొందరిని ధిక్కరించారు, మరి కొందరిని హతమార్చటం కూడా చేశారు.”[8]
ఈ ఆయతులనుసారం, యూదుల పెద్దలు దైవప్రవక్తల ఉపదేశాలను తమ భౌతిక లాభాలకు వ్యతిరేకంగా ఉండడాన్ని చూసి అలాగే వాళ్ల మాటలు తమ మనోవాంఛలకు భినంగా ఉండడాన్ని చూసి దైవప్రవక్తలకు వ్యతిరేకించేవారు మరియు అహంకారం మరియు అహంభావంతో దైవప్రవక్తలను నిరాకరించేవారు మరియు వారిని అబద్ధాల కోరులుగా వ్యక్తం చేసేవారు. వాళ్లలో కొందరిని హతమార్చేవారు; దీనికి పై చెప్పబడినా ఆయతే నిదర్శనం.
4. హిజాబ్: ద్వేషం మరియు మొండితనం వల్ల వాళ్ల హృదయాల పై ముసుగు వేయబడింది మరియు యదార్థాన్ని చూడలేక పోయారు. ఖుర్ఆన్: వారిలా అన్నారు: “నువ్వు దేని వైపుకు మమ్మల్ని పిలుస్తున్నావో దానికి సంబంధించి మా హృదయాలు తెరలలో ఉన్నాయి. మా చెవులలో భారం ఉంది. నీకూ – నాకూ మధ్య ఒక (అడ్డు) తెర ఉంది.”[9].
రిఫరెన్స్
1. కులైనీ, మొహమ్మద్ బిన్ యాఖూబ్, కాఫీ, మొహఖ్ఖిక్, ముసహ్హెహ్, గఫ్ఫారీ, అలీ అక్బర్, ఆఖూందీ, మొహమ్మద్, భాగ8, పేజీ8, తెహ్రాన్, దారుల్ కుతుబ్ అల్ ఇస్లామియహ్, చాప్4, 1407ఖ. وَ اِیَّاکُمْ اَنْ یَحْسُدَ بَعْضُکُمْ بَعْضاً فَاِنَّ الْکُفْرَ اَصْلُهُ الْحَسَد
2. బఖరా, ఆయత్109.
وَدَّ کَثیرٌ مِنْ أَهْلِ الْکِتابِ لَوْ یَرُدُّونَکُمْ مِنْ بَعْدِ إیمانِکُمْ کُفَّاراً حَسَداً مِنْ عِنْدِ أَنْفُسِهِمْ مِنْ بَعْدِ ما تَبَیَّنَ لَهُمُ الْحَقُّ...
3. మకారిమ్ షీరాజీ, నాసిర్, తఫ్సీరె నమూనహ్, భాగం1, పేజీ 399, తెహ్రాన్, దారుల్ కుతుబ్ అల్ ఇస్లామియహ్, 1374ష.
4. చూ. తబర్సీ, ఫజ్ల్ ఇబ్నె హసన్, మజ్మవుల్ బయాన్, ముఖద్దమహ్, బలాగీ, మొహమ్మద్ జవాద్, భాగం1, పేజీ353, తెహ్రాన్, నాసిర్ ఖుస్రూ, చాప్3, 1372ష.
5. బఖరా, ఆయత్89.
وَ لَمَّا جَاءَهُمْ کِتَابٌ مِّنْ عِندِ اللَّهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْ وَ کاَنُواْ مِن قَبْلُ یَسْتَفْتِحُونَ عَلیَ الَّذِینَ کَفَرُواْ فَلَمَّا جَاءَهُم مَّا عَرَفُواْ کَفَرُواْ بِهِ
6. బఖరా, ఆయత్41.
وَ آمِنُوا بِما أَنْزَلْتُ مُصَدِّقاً لِما مَعَکُمْ وَ لا تَکُونُوا أَوَّلَ کافِرٍ بِه وَ لاتَشْتَروُا بِآیاتى ثَمَناً قَلیلا وَ اِیّىَ فَاتَّقُونِ
7. జాఫరీ, యాకూబ్, కౌసర్, భాగం1, పేజీ267, బీ.జా, బీ.తా.
8. బఖరా, ఆయత్87.
أَ فَکُلَّما جاءَکُمْ رَسُولٌ بِما لا تَهْوى أَنْفُسُکُمُ اسْتَکْبَرْتُمْ فَفَریقاً کَذَّبْتُمْ وَ فَریقاً تَقْتُلُون
9. ఫుస్సిలత్, ఆయత్5.
وَ قالُوا قُلُوبُنا فِی أَکِنَّةٍ مِمَّا تَدْعُونا إِلَیْهِ وَ فِی آذانِنا وَقْرٌ وَ مِنْ بَیْنِنا وَ بَیْنِکَ حِجابٌ
వ్యాఖ్యానించండి