హజ్రత్ జహ్రా(స.అ) షహాదత్ అహ్లె సున్నత్ గ్రంథాలలో

శని, 11/25/2023 - 12:49

హజ్రత్ జహ్రా(స.అ) షహాదత్ గురించి అహ్లె సున్నత్ గ్రంథాలలో ఏమని ఉల్లేఖించబడి ఉంది అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

హజ్రత్ జహ్రా(స.అ) షహాదత్ అహ్లె సున్నత్ గ్రంథాలలో

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

అహ్మద్ ఇబ్నె హంబల్[1], ఉమ్మె సల్మా ద్వార ఇలా ఉల్లేఖించెను:
ఫాతెమా అనారోగ్యంతో ఉన్నారు, ఆ అనారోగ్యమే వారి మరణానికి కారణం అయ్యింది, నేను వారిని బాగోగులు చూసుకునే దాన్ని. ఆ రోజు ఆమె ఆరోగ్యం బాగుంది, అలీ(అ.స) పనులు చూసుకోవడానికి బయటకు వెళ్లి ఉన్నారు. నాతో “నా కోసం నీళ్లు తీసుకొని రా” అని అన్నారు.
నేను నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాను, ఆమె చాలా బాగా తనను తాను కడుకున్నారు(స్నానం చేసుకున్నారు)
అప్పుడు ఇలా అన్నారు: నా కొత్త బట్టలు తీసుకొని రా
బట్టలు తీసుకొచ్చాను, ఆమె బట్టులు ధరించి నా పడకను గది మధ్యలో పరుచు అని అన్నారు.
ఆమె చెప్పినవాటిని అమలు పరిచాను. ఆమె ఖిబ్లా వైపుకు, చేతులను బుగ్గల క్రింద పెట్టుకొని ప్రక్కకు తిరిగి పడుకొని ఇలా అన్నారు: నా మృత్యువు సమయం ఆసన్నమయ్యింది, నన్ను నేను శుభ్రపరుచుకున్నాను, అందుకని ఎవరూ నా బట్టలు నా నుండి వేరు చేయకండి.
(ఇలా చెప్పి) ఈ లోకం నుండి వెళ్లి పోయారు. ఆ తరువాత అలీ(అ.స) వచ్చారు, నేను వారికి జరిగింది చెప్పాను.

ముహిబ్బె తబరీ[2] కూడా ఈ హదీస్ ను అహ్మద్ మనాఖిబ్ నుండి మరియు దులాయి ఉమ్మె సల్మా నుండి ఉల్లేఖించారు. ఇబ్నె అసీర్[3] కూడా ఉమ్మె సల్మా నుండి ఉల్లేఖించారు.
అదే విధంగా[4] ఇమామ్ బాఖిర్(అ.స) తల్లి గారి నుండి రివాయత్ ఉల్లేఖించబడి ఉంది: ఫాతెమా(స.అ), అస్మా బింతె ఉమైస్ తో ఇలా అన్నారు: స్ర్తీ మృతదేహాన్ని కప్పడానికి దాని పై గడ్డను వేస్తారు, ఈ పద్ధతి నాకు నచ్చదు.

అస్మా చెప్పారు: ఓ దైవప్రవక్త(స.అ) కుమార్తె, మీరు అనుమతిస్తే నేను హబషా లో చూసిన విధానాన్ని మీకు చూపెడతాను.
అప్పుడు కొన్ని లేత కర్రలను తీసుకొచ్చి వాటిని వంచి వాటిపై బట్టను వేశారు. హజ్రత్ ఫాతెమా(స.అ) ఇలా అన్నారు: ఎంత బాగుందో, చూడడానికి చాలా బాగుంది, దీంతో స్త్రీ జనాజా మరియు పురుషుడి జనాజా అన్న విషయం తెలిసిరాదు. నేను ఈ లోకాన్ని విడిచి వెళ్లిన తరువాత, నువ్వు మరియు అలీ(అ.స) నాకు గుస్ల్ ఇవ్వండి మరెవ్వరూ ఉండకూడదు. ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లినప్పుడు ఆయిషా వచ్చారు, లోపలికి రావాలనుకున్నారు, అస్మా ఆమెతో లోపలికి ప్రవేశించకు, అని అన్నారు.

ఆయిషా అబూబక్ర్ వద్దకు వచ్చి ఫిర్యాదు చేసింది, ఈ అస్మా ఫాతెమా ను గుస్ల్ ఇచ్చే చర్యలో పాల్గోనివ్వడం లేదు, దైవప్రవక్త(స.అ) కుమార్తె కోసం పెళ్లికూతుర్ల కోసం ఉపయోగించేటువంటి తొట్టిని (హౌదజ్) ను సిద్ధం చేసింది. అని చెప్పారు.
ఆ తరువాత అబూబక్ర్ వచ్చి తలుపు వద్ద నిలబడి ఇలా అన్నారు: అస్మా! ఎందుకని దైవప్రవక్త(స.అ) భార్యలను ఆయన కుమార్తె గుస్ల్ ఇచ్చే చర్యలలో పాల్గోనివ్వడం లేదు. ఎందుకని పెళ్లి కూతురు హౌదజ్ లాంటిది ఆమె కోసం సిద్ధం చేశావు? అస్మా ఇలా అన్నారు: ఫాతెమా యే నాతో కోరారు ఎవ్వరిని రానివ్వకు అని. నేను సిద్ధం చేసిన దానిని ఆమె కోసం చేసి చూపించాను ఆమె కోసం కూడా తయారు చేయమని నాతో కోరారు.
అబూబక్ర్ ఇలా అన్నారు: ఏదైంతే ఫాతెమా ఆజ్ఞాపించారో అదే చేయి.
అప్పుడు అబూబక్ర తిరిగి వెళ్లిపోయారు, ఫాతెమా(స.అ) ను అలీ(అ.స) మరియు అస్మా గుస్ల్ ఇచ్చారు.

రిఫరెన్స్
1. ముస్నదె అహ్మద్ ఇబ్నె హంబల్, భాగం6, పేజీ461.
2. జఖాయిరుల్ ఉఖ్బా, పేజీ53.
3. ఉస్దుల్ గాబహ్, భాగం5, పేజీ590.
4. జఖాయిరుల్ ఉఖ్బా, భాగం5, పేజీ590., సుననె బైహఖీ, భాగం4, పేజీ34.   

https://makarem.ir/main.aspx?lid=0&typeinfo=23&catid=23928&pageindex=0&m...  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 17 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 28