హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) షహాదత్

శుక్ర, 11/24/2023 - 12:31

18 సంవత్సరాల కాలంలో ఆడది ఒక ఉత్తమ కుమార్తె, ఒక ఉత్తమ భార్య మరియు ఒక ఉత్తమ తల్లిగా ఎలా ఉండాలో ప్రపంచానికి చాటి చెప్పిన ఉత్తమ స్ర్తీ గురించి సంక్షిప్త వివరణ...

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) షహాదత్

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ), దైవప్రవక్త(స.అ) మరియు హజ్రత్ ఖదీజా(స.అ) దంపతుల ఏకైక కుమార్తె. బెఅసత్ యొక్క 5వ సంవత్సరం జుమాదల్ సానియా 20వ తేదీన మక్కాలో జన్మించారు. అమె బిరుదులు “జహ్రా”, “సిద్దీఖహ్”, “తాహిరహ్”, “ముబారకహ్”, “బతూల్”, “రాజియహ్”, “మర్‌జియా”. రివాయతులలో ప్రతీ పేరుకు ఒక కారణం వివరించబడి ఉంది. 
అప్పుడే జన్మించిన ఆ పాపాను దైవప్రవక్త(స.అ) ఎత్తుకొని “ఫాతెమా నా ప్రాణం, ఆమె నుంచి స్వర్గపు సువాసన వస్తుంది” అన్నారు.

జనాబె ఫాతెమా జహ్‌రా(స.అ), 5 సంవత్సరాల వయసులోనే తమ తల్లిని పోగొట్టుకున్నారు. దైవప్రవక్త(స.అ) వారిని చాలా గౌరవించేవారు, ఎల్లపుడూ “ఫాతెమా నాలోని భాగం, ఆమెను సంతోషపరచిన వాడు నన్ను సంతోషపరచినట్లు మరియు నన్ను సంతోషపరచడం అల్లాహ్‌ను సంతోషపరచినట్లు, ఆమెను బాధ కలిగిస్తే నన్ను బాధ కలిగించినట్టే, నన్ను బాధ కలిగించడం అల్లాహ్‌ను బాధ కలిగించినట్టు” అనేవారు.
జనాబె ఫాతెమా జహ్‌రా(స.అ) వివాహం హిజ్రీ యొక్క 2వ ఏట హజ్రత్ అలీ(అ.స)తో జరిగింది. వారికి ముగ్గురు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు.

హిజాబ్ ప్రాముఖ్యత
ఒకరోజు “ఒక స్ర్తీకి ఏది అన్నింటికి మించిన శ్రేయస్కరం?” అని దైవప్రవక్త(స.అ) ప్రశ్నించగా ఫాతెమా(అ.స) “నాన్నాగారు! పరాయి మగాడు ఆమెను చూడ కూడదు అలాగే ఆమే ఏ పరాయి వ్యక్తిని చూడకూడదు”. ఈ సమాధానం విని దైవప్రవక్త(స.అ) చాల సంతోషించారు.[2]
ఇదే ఆమె తన అనుచరుల నుండి ఆశించేది కూడా.

పొరుగువారి ప్రముఖ్యత
ఇమామ్ హసన్(అ.స) కథానుసారం: నేను ఒకరోజు అమ్మను రాత్రంతా అల్లాహ్‌ను ప్రార్ధింస్తూ, ప్రజల కోసం దుఆ చేస్తుండగా చూశాను. సుర్యోదయం అయ్యింది. నేను అమ్మ వద్దకు వెళ్ళి “అమ్మా! మీరు, మీ కోసం ఎందుకు దుఆ చేసుకో లేదు?” అని ప్రశ్నించాను. ఆమె ఇలా అన్నారు: బాబూ! ముందు పొరుగు వారు ఆ తరువాత ఇంట్లో వారు.[1]
పొరుగువారి గురించి ఆమె ఎంతేలా ఆలోచించేవారో, వారి పట్ల మనపై ఎంత బాధ్యత ఉందో ఈ రివాయత్ ద్వార మనకు తెలుస్తుంది.

హజ్రత్ ఫాతెమా(అ.స) మరణం
హజ్రత్ ఫాతెమా(అ.స) తండ్రి అయిన ప్రవక్త హజ్రత్ ముహమ్మద్(అ.స) మరణించిన డబ్భై ఐదు (75) లేదా తొంబ్భై ఐదు (95) రోజుల్లోనే ఆమె కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. కొందరు కపటవర్తనులు ఆమె ఇంటికి వచ్చి ఆమె భర్త హజ్రత్ అలీ(అ.స) తో బైఅత్ తీసుకోవడం కోసం బయటికి రమ్మని, లేకపోతే ఇల్లు తగలబెడతామని బెదిరించారు. ఆ అరుపులు విన్న హజ్రత్ జహ్‌రా(స.అ) తలుపు వెనక నుండి “ఈ ఇంట్లో ప్రవక్త మనవళ్ళు హసన్(అ.స) మరియు హుసైన్(అ.స)లు ఉన్నారు, కనీసం వారి గురించైనా ఆలోచించండి” అని అన్నారు. కాని వాళ్శు హజ్రత్ జహ్రా(అ.స) మాటలను వినలేదు కొంత సమయం గడిచిన తరువాత వాళ్ళు ఇంటిని తగల బెట్టారు. కాలుతున్న తలుపును తెరవడానికై ప్రయత్నిస్తున్న కపటవర్తనుల ప్రయత్నాన్ని విఫలం చేయడానికై తలుపుకు అటువైపున్న హజ్రత్ జహ్‌రా(స.అ) దానిని తెరవనీయకుండా తమకున్న కొద్ది పాటి బలంతో అడ్డు కున్నారు. కాని వాళ్ళలో ఒకడు కొరడాతో కొట్టమని చెప్పగా మరొకడు కొరడా తీసి జహ్రత్ జహ్రా(స.అ)పై దాడి చేశాడు. ఆ కొరడాతో గాయపడినా సరే హజ్రత్ జహ్రా(స.అ) అక్కడ నుండి కదల లేదు. కొరడాతో గాయం చేయడమే కాకుండా ఒక దుష్టుడు తలుపును తన కాలితో గట్టిగా తన్నాడు. ఆమె తలుపు మరియు గోడ మధ్యలో నలిగిపోవడం వల్ల ఆమె గర్భములో ఉన్న పిల్లాడు హజ్రత్ మొహ్‌సిన్(అ.స) చనిపోయారు, అంతేకాక ఆమె ప్రక్కటెముకలు విరిగి పోయాయి. ఇన్ని వేదనలు ఒకేసారి పడడంతో ఆమె స్ప్రహ తప్పిపోయారు.
హజ్రత్ ఫాతెమా(స.అ), ఇమామ్ అలీ(అ.స) ఖిలా ఫత్ హక్కును పొందడం కొరకు చాలా ప్రయత్నించారు మరియు చాలా అవమానాలను భరించారు.

చివరికి జుమాదల్ వూలా మాసం 13వ తేదీ లేదా జుమాద స్సానియా మాసం 3వ తేదిన కపటవర్తనుల దాడి ద్వార కలిగిన గాయాల ప్రభావం వల్ల మరణించారు. ఆమె వీలునామా ప్రకారం ఎవరైతే ఆమె భర్త ఖిలాఫత్ హక్కును దౌర్జన్యంగా లాక్కున్నారో మరియు ఆమెను కష్టపెట్టారో వాళ్ళని తమ అంతిమ యాత్రలో రానీయకుడదని చెప్పడం వలన రాత్రి చీకటిలోనే ఆమె అంతిమ సంస్కారాలను చేశారు.[3]

ఆమె స్ర్తీలకు నమూనా
హజ్రత్ ఫాతెమా(అ.స) జీవత కాలం 18 సంవత్సరాలు అందులో 9 సంవత్సరాలు తండ్రి వద్ద మరియు 9 సంవత్సరాలు వారి భర్త హజ్రత్ అలీ(అ.స) వద్ద గడిచాయి. ఆ 18 సంవత్సరాల కాలంలో ఆడది ఒక ఉత్తమ కుమార్తె, ఒక ఉత్తమ భార్య మరియు ఒక ఉత్తమ తల్లిగా ఎలా ఉండాలో ప్రపంచానికి చాటి చేప్పారు.

రిఫరెన్స్
1. షేఖ్ సదూఖ్, ఇలలుష్ షరాయే, భాగం1, పేజీ183.
یا بُنَیَّ الْجارُ ثُمَّ الدّارُ
2. కష్ఫుల్ గుమ్మా, అర్బలీ, భాగం2, పేజీ23, 24.
3. షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, ముంతహల్ ఆమాల్, భాగం1, పేజీ178-189, పబ్లీషర్స్ నసీమె హయాత్, 1383.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5