ఫాతెమియా ఎందుకు

శని, 12/16/2023 - 15:18

ఫాతెమియా అంటే ఏమిటీ, దాని ప్రాముఖ్యత ఏమిటీ, దైవప్రవక్త(స.అ) మరణించిన తరువాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ...

ఫాతెమియా ఎందుకు

ఫాతెమియా అంటే ఏమిటీ, దాని ప్రాముఖ్యత ఏమిటీ, దైవప్రవక్త(స.అ) మరణించిన తరువాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, ఆ సంఘటనలతో మన విశ్వాసాలకు, మన మాతానికి గల సంబంధమేమిటీ, ఎందుకని కొందరు ఫాతెమియా ను నిషేధించాలని క్రమంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు, ఎలాగో అలాగా ఈ రోజుల ప్రాముఖ్యతను తరగించాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఫాతెమియా తషయ్యో యొక్క మూల మరియు విశ్యాసాలకు చెందిన ఒక ముఖ్య సమస్య అయిన అహ్లెబైత్(అ.స) యొక్క ఇమామత్ మరియు విలాయత్ కు సంబంధించి ఉంది. దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు.. నేను మీ మధ్య రెండు అమూల్యమైనవాటిని విడిచి వెళ్తున్నాను, ఒకటి ఖుర్ఆన్ మరియు రెండవది నా ఇత్రత్ వారే నా అహ్లెబైత్ వీళ్లతో కలిసి ఉంటే నా తరువాత మార్గభ్రష్టతకు గురి కారు. ఇవి కౌసర్ హౌజ్ వద్ద నాతో కలవనంత వరకు వేరు కారు.[1]

సఖ్లైన్ హదీస్ లో దైవప్రవక్త(స.అ), ఉమ్మత్ యొక్క విముక్తి ఖుర్ఆన్ మరియు అహ్లెబైత్ అని సూచించారు, ప్రకటించారు. తన ఉమ్మత్ ను ఖుర్ఆన్ మరియు అహ్లె బైత్ లతో పాటు కలిసి ఉండమని ఆదేశించారు. నా తరువాత మార్గభ్రష్టత నుండి సురక్షితంగా ఉండాలనుకుంటే ఒకేమార్గం వీళ్ళతో కలిసి ఉండడం అని సూచించారు. మనిషి వాళ్లతో కలిసి ఉన్నంత కాలం మార్గభ్రష్టత నుండి సురక్షితంగా ఉన్నట్లే. వాళ్లతో వేరవ్వగానే మార్గభ్రష్టత ఊబిలో కూరుకుపోయినట్లే.

ఇదే విధంగా వేరే హదీసులో దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: “తన కాలంలో ఉన్న ఇమామ్ పట్ల జ్ఞానం లేకుండా మరణించినవాడి మరణం, అజ్ఞాన కాలపు(అనగా షిర్క్) మరణం పొందినట్లు”[2]

ఇమామ్ హుసైన్(అ.స) కూడా పై హదీస్ భావాన్ని సూచిస్తూనే ఇలా ఉపదేశించారు: అల్లాహ్ మానవుల్ని కేవలం ఆయన గుర్తించాలని ఆయన గురించి తెలుసుకోవాలని సృష్టించాడు. ఆయన గురించి తెలుసుకుంటే ఆయనను ఆరాధిస్తారు, ఆయనను ఆరాధిస్తే ఇక మరెవ్వరినీ ఆరాధించే అవసరం ఉండదు.

ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడు: ఓ దైవప్రవక్త(స.అ) కుమారా, నా తల్లిదండ్రులు మీపై ఫిదా, అల్లాహ్ పట్ల జ్ఞానం అంటే ఏమిటో నాకు తెలియపరచండి2. ఇమామ్ ఇలా సమాధానమిచ్చారు: “ప్రతీ కాలపు మనషులు ఆయన విధేయత తప్పని సరి అయిన తన కాలపు ఇమామ్ గురించి తెలుసుకోవడం”[3]

1. సహీ తిర్మిజీ, భాగం5, పేజీ662 మరియు 328; ముస్తద్రికె హాకిమ్, భాగం3, పేజీ109, 110, 148, 533; సుననె ఇబ్నె మాజహ్, భాగం2, పేజీ432; ముస్నదె అహ్మద్ ఇబ్నె హంబల్, భాగం3, పేజీ14, 17, 26, 59, భాగం4, పేజీ366-370; ఫజాయిల్ అస్ సహాబహ్, అహ్మద్ ఇబ్నె హంబల్, భాగం2, పేజీ585; ఖసాయిసె నిసాయి, పేజీ21, 30; సవాయిఖుల్ మొహ్రిఖహ్, ఇబ్నె హజరె హైసమీ, ఫస్ల్11, భాగం1, పేజీ230; కన్జుల్ ఉమ్మాల్, ముత్తఖీ హిందీ, భాగం1, పేజీ44; తఫ్సీరె ఇబ్నె కసీర్, భాగం4, పేజీ113; తబఖాతుల్ కుబ్రా, ఇబ్నె సఅద్, భాగం2, పేజీ194, మజ్మవుల్ జవాయిద్, హైసమీ, భాగం9, పేజీ163; తారీఖు ఇబ్నె అసాకిర్, భాగం5, పేజీ436; యనాబీవుల్ మవద్దహ్, ఖందూజీ హనఫీ, పేజీ38, 183, వివిధ విధాలుగా ఉల్లేఖించారు:
إِنِّي تَارِكٌ فِيكُمُ اَلثَّقَلَيْنِ كِتَابَ اَللَّهِ وَ عِتْرَتِي أَهْلَ بَيْتِي [مَا إِنْ تَمَسَّكْتُمْ بِهِمَا لَنْ تَضِلُّوا بَعْدِي أَبَداً] وَ لَنْ يَفْتَرِقَا حَتَّى يَرِدَا عَلَيَّ اَلْحَوْضَ
2. కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, కాఫీ, భాగం3, పేజీ58; షేఖ్ సదూఖ్, కమాలుద్దీన్, భాగం2, పేజీ409; ఇబ్నె హంబల్, ముస్నదె అహ్మద్, భాగం28, పేజీ88; అబూ దావూద్, ముస్నద్, భాగం3, పేజీ425.
مَنْ ماتَ وَ لَمْ یعْرِفْ إمامَ زَمانِهِ مَاتَ مِیتَةً جَاهِلِیة۔
3. షేఖ్ సదూఖ్, ఇలల్ అష్ షరాయెహ్, భాగం1, పేజీ9.
حَدَّثَنَا أَبِي رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ حَدَّثَنَا أَحْمَدُ بْنُ إِدْرِيسَ عَنِ الْحُسَيْنِ بْنِ عُبَيْدِ اللَّهِ عَنِ الْحَسَنِ بْنِ عَلِيِّ بْنِ أَبِي عُثْمَانَ عَنْ عَبْدِ الْكَرِيمِ بْنِ عُبَيْدِ اللَّهِ عَنْ سَلَمَةَ بْنِ عَطَاءٍ عَنْ أَبِي عَبْدِ اللَّهِ (ع) قَالَ خَرَجَ الْحُسَيْنُ بْنُ عَلِيٍّ (ع) عَلَى أَصْحَابِهِ فَقَالَ أَيُّهَا النَّاسُ إِنَّ اللَّهَ جَلَّ ذِكْرُهُ مَا خَلَقَ الْعِبَادَ إِلَّا لِيَعْرِفُوهُ فَإِذَا عَرَفُوهُ عَبَدُوهُ فَإِذَا عَبَدُوهُ اسْتَغْنَوْا بِعِبَادَتِهِ عَنْ عِبَادَةِ مَنْ سِوَاهُ فَقَالَ لَهُ رَجُلٌ يَا ابْنَ رَسُولِ اللَّهِ بِأَبِي أَنْتَ وَ أُمِّي فَمَا مَعْرِفَةُ اللَّهِ قَالَ مَعْرِفَةُ أَهْلِ كُلِّ زَمَانٍ إِمَامَهُمُ الَّذِي يَجِبُ عَلَيْهِمْ طَاعَتُهُ     

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17