.ఫాతెమా జహ్రా[అ.స] ఇంటికి వచ్చి ఇంటిని తగలబెడతానని బెదిరించిన సంఘటన ప్రముఖ రచయిత తన గ్రంథంలో ఉల్లేఖించిన రివాయత్.
అహ్లె సున్నత్ యొక్క ప్రముఖ రచయిత, హదీస్ జ్ఞానంలో ముఖ్యా గ్రంథాలు రచించినటువంటి “ఇబ్నె ఖుతైబహ్” తన గ్రంథం “అల్ ఇమామతు వస్సియాసహ్”లో ఇలా ఉల్లేఖించారు: అబూబక్ర్, ఎవరైతే అతని బైఅత్ ను అంగీకరించకుండా అలీ[అ.స] ఇంట్లో సమావేశమైయ్యారో వారి గురించి తెలుసుకొని ఉమర్ ను వారి వద్దకు పంపారు. అతను అలీ[అ.స] ఇంటికి వచ్చారు మరియు అందరిని బయటికి రండి అని పిలిచారు. వారెవ్వరూ ఇంటి నుండి బయటకు రాలేదు, అప్పుడు ఉమర్ కట్టెలను తీసుకొని రండి అని కోరి ఇలా అన్నారు: “ఉమర్ ప్రాణాల పై అధికారం కలిగివున్న ఆ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను బయటకి రండి లేకపోతే ఇంటిని తగలబెట్టి మీ తలపై కూల్చేస్తాను”. ఒకడు ఉమర్ తో ఇలా అన్నాడు: “ఓ అబూ హఫ్సా(ఉమర్ యొక్క కున్నియత్) ఈ ఇంట్లో దైవప్రవక్త[అ.స] కుమార్తె ఫాతెమా[అ.స] ఉంది”. ఉమర్: “ఉంటే ఉండని!!”[అల్ ఇమామతు వస్సియాసహ్, పేజీ12].
“ఇబ్నె ఖుతైబహ్” ఈ సంఘటన తరువాత మనసును కలచివేసే విధంగా ఉల్లేఖించారు. వారు ఇలా అన్నారు: “ఉమర్ కొంతమందితో పాటు ఫాతెమా గారి ఇంటికి వచ్చారు, తలుపు తట్టారు, ఫాతెమా[అ.స] వారి శబ్ధాలను విన్నప్పుడు, గట్టిగా ఇలా అన్నారు: “ఓ దైవప్రవక్త! మీ తరువాత ఖత్తాబ్ కుమారుడి మరియు అబీ ఖహాఫా నుండి మా పై ఎన్ని కష్టాలు పడ్డాయో”. ఉమర్ తో వచ్చిన వారు జహ్రా[అ.స] మాటలు మరియు రోధనను విని తిరిగి వెళ్ళిపోయారు కాని ఉమర్ కొందరితో పాటు అక్కడే ఉండిపోయి అలీ[అ.స] ను బయటకు తీసుకొచ్చి అతనిని అబూబక్ర్ వద్దకు తీసుకొని వెళ్ళి బైఅత్ చేయమని అన్నారు, అలీ[అ.స] “ఒకవేళ నేను బైఅత్ చేయకుంటే?”. వాళ్ళు: “అల్లాహ్ సాక్షిగా నీ తలను నరుకుతాం....,”
రిఫ్రెన్స్
అల్ ఇమామతు వస్సియాసహ్, పేజీ12, మక్తబతు తిజారతు కుబ్రా, మిస్ర్.
వ్యాఖ్యలు
Mashaallah.....Allah Salamat rakhe aap log ku.....
Refrence k saat haq baat ko samjhate hai....Jazakallah.
Bahot Bahot Shukriya site par aakar padhne ka aur comment kar k apna opinion bataane ka.
వ్యాఖ్యానించండి