ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) యొక్క సుగుణాలను నిదర్శిస్తున్న మూడు సంఘటనలు...
దైవస్మరణ
ఇబ్నె ఖద్దాహ్ ఇమామ్ సాదిఖ్(అ.స) ద్వార రివాయత్ ను ఇలా ఉల్లేఖించెను: నాన్నగారు(ఇమామ్ బాఖిర్) చాలా ఎక్కువగా దైవస్మరణ చేసేవారు, అల్లాహ్ ను చాలా ఎక్కువగా స్మరించేవారు, నేను వారి వద్దకు ఎప్పుడు వెళ్లినా వారిని అల్లాహ్ ను స్మరిస్తుండగానే చూసే వాడ్ని. వారితో భోజనానికి కూర్చున్నప్పుడు కూడా చూసేవాడిని ఆయన నోట దైవస్మరణ ఉండేది. వారు ప్రజలతో మాట్లాడేటప్పుడు కూడా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండేవారు.
నేను నిత్యం వారిని చూసేవాడిని వారి నాలుక పై భాగాన్ని తగిలి ఉండేది మరియు “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని జపిస్తూ ఉండేవారు. వారు ఇంట్లో మనందరిని ఒకే చోటుకు పిలిచి సూర్యోదయం వరకు అల్లాహ్ ను స్మరించమని అనేవారు, ఖుర్ఆన్ పఠించడం వచ్చిన వారికి ఖుర్ఆన్ పఠించమని, చదవడం రాని వారికి దైవస్మరణ చేయమని ఆదేశించేవారు.[1]
జురారహ్ ఇబ్నె అఅయున్: అబూ జాఫర్ ఇమామ్ బాఖిర్(అ.స) ఖురైష్ కు చెందిన ఒక వ్యక్తి అంతిమ యాత్రలో పాల్గొన్నారు, నేను కూడా వారితో ఉన్నాను, అతా ఇబ్నె అబీ రిబాహ్ కూడా ఉన్నారు, ఒకవిడ జనాజా వెనక అరుపులతో ఏడుస్తుంది, అతా ఆమెతో ఇలా అన్నాడు: అరవకు, మౌనంగా ఉండు లేకపోతే తిరిగి వెళ్లిపోతాను, ఆమె అరుస్తూనే ఉండడంతో, అతా తిరిగి వెళ్లి పోయాడు.
నేను ఇమామ్ బాఖిర్(అ.స)తో అతా తిరిగి వెళ్లి పోయాడు అని అన్నాను. వారు ఎందుకు? అని అడిగారు.
ఆమె అరవడం ఆపలేదని అతడు తిరిగి వెళ్లి పోయాడు. ఇమామ్ బాఖిర్ ఇలా అన్నారు.. నువ్వు జనాజాతో ముందుకు వెళ్లడం ఆపకు, మేము ఒక తప్పుడు పనితో పాటు యదార్ధాన్ని చూసినప్పుడు, ఆ తప్పు వల్ల యదార్థాన్ని వదిలేస్తే ఒక ముస్లిం పట్ల మనకున్న బాధ్యతను నిర్వర్తించనట్లు.
మయ్యత్ నమాజ్ పూర్తయిన తరువాత, మృతుడి వారసుడు వచ్చి ఇమామ్ తో ఇలా అన్నాడు: వెళ్లండి, అల్లాహ్ మీపై కారుణ్యం కురిపించుగాక, మీకు కష్టం కలుగుతుంది, ఇమామ్ తిరిగారు. నేను ఇమామ్ తో ఇలా అన్నాను: మృతుడి వారసుడు అనుమతిచ్చాడు కదా తిరిగి వెళ్లిపోండి, నాకు కూడా మీతో పనుంది, ఇమామ్ “నిస్సందేహంగా నువ్వు ముందుకు వెళ్లు, మేము అతడి అనుమతితో రాలేదు అతడు అనుమతిస్తే తిరిగి వెళ్లడానికి. మేము ఈ చర్యతో అల్లాహ్ యొక్క కారుణ్యానికి చేరాలనుకున్నాము, మనిషి ఎంత సమయం అయితే జనాజా వెనక ఉంటాడో అంత సేపు పుణ్యాన్ని పొందుతాడు.[2]
తస్లీమ్
ఒక సమూహం హజ్రత్ ఇమామ్ బాఖిర్(అ.స) వద్దకు వచ్చారు, ఇమామ్ యొక్క బాబు అనారోగ్యంతో ఉన్నాడు, దాని వల్ల వారు కొంచెం అశాంతికి గురి అయ్యారు. వాళ్లు “ఈ బాబు మరణిచకూడదు లేక పోతే ఇమామ్ కు కష్టమైపోతుంది అని అనుకున్నారు. ఇంతలో ఆడాళ్ల ఏడ్పులు మొదలయ్యాయి, పిల్లాడు మరణించాడని తెలిసింది, కొంత సమయం గడిచిన తరువాత ఇమామ్ వాళ్ల వద్దకు వచ్చారు కాని వారి ముఖం పై దుఖం లేదు. అప్పుడు వాళ్లు ఇలా అన్నారు” అల్లాహ్ మమ్మల్ని మీ పై ఫదా చేయుగాక, ఒకవేళ అదైనా జరిగితే మీ పరిస్థితి మమ్మల్ని కష్టపెట్టే పరిస్థితి అవుతుందేమో అనుకున్నాము కాని చూస్తే మీరు అనుకున్నదానికి భిన్నంగా ఉన్నారు.
ఇమామ్: మనం ఇష్టపడేవారు, మాకు ఇష్టమైనవారు బాగా ఉండాలని అనుకుంటాం, అల్లాహ్ విధి కి సంభవిస్తే మేము దానికి లోబడ ఉంటాము, అల్లాహ్ ఇష్టపడాలని”[3]
అల్లాహ్ ఆగ్రహానికి గురికాకూడదు
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) యొక్క పనివాడు, అతడి పేరు అఫ్లహ్, అతడు ఇలా అన్నాడు: నేను ఇమామ్ తో పు హజ్ కు వెళ్లాను, ఇమామ్ మస్జిదుల్ హరామ్ లో ప్రవేశించారు, కాబాను చూసి బిగ్గరగా ఏడ్వడం మొదలు పెట్టారు. నేను “నా తల్లిదండ్రులు మీపై ఫిదా అవుగాక, ప్రజలు చూస్తున్నారు, కొంచెం మెల్లగా ఏడవండి” అని అన్నారు. దానికి వారు “ఎందుకు ఏడవకూడదు భహుశా అల్లాహ్ ఆయన కారుణ్య దృష్టితో నన్ను చూస్తాడేమో దాంతో రేపు ప్రళయదినాన వారి ముందు ముక్తికి చేరుతానేమో” అని సమాధానమిచ్చారు.
అప్పుడు గృహాన్ని దర్శించుకున్నారు, మఖామె ఇబ్రాహీమ్ వద్దకు వచ్చి నమాజ్ చదువుకున్నారు, సజ్దా నుండి తలను ఎత్తినప్పుడు వారి సజ్దా ప్రదేశం కన్నిళ్లతో తడిసిపోయి ఉంది. వారు ..ఓ అల్లాహ్ నన్ను నీ ఆగ్రహానికి గురి చేయకు.. అని అంటున్నారు.[4]
రిఫరెన్స్
1. కులైనీ, ముహమ్మద్ ఇబ్నె యాఖూమ్, కాఫీ, భాగం2, పేజీ499.
2. కులైనీ, ముహమ్మద్ ఇబ్నె యాఖూమ్, కాఫీ, భాగం3, పేజీ177, 172.
3. కులైనీ, ముహమ్మద్ ఇబ్నె యాఖూమ్, కాఫీ, భాగం3, పేజీ226.
4. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, భాగం46, పేజీ290.
వ్యాఖ్యానించండి