న్యాయమైన అధికారం

బుధ, 01/10/2024 - 14:00

న్యాయమైన అధికారం యొక్క లక్షణాలు మరియు అవసరమైన వివరణాలు...

న్యాయమైన అధికారం

న్యాయం:
అబద్ధం, చాడీలు చెప్పడం, పాపములు చేయడం మరియు ఇతర దుర్మార్గాలకు దూరంగా ఉండే వారిని న్యాయమైనవారు అని అంటారు. ఇస్లామీయ భాషలో “ఆదిల్” అంటారు. న్యాయధర్మాలను పాటించమని ఇస్లాం ఆదేశిస్తుంది మరియు ఖుర్ఆన్ దీని గురించి చాలా తాకీదు చేస్తుంది.

సామాజిక న్యాయం:
అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “అల్లాహ్ న్యాయం చేయమనీ, ఉపకారం(ఇహ్సాన్) చేయమనీ, బంధువుల హక్కులను నెరవేర్చమనీ ఆజ్ఞాపిస్తున్నాడు”[సూరయె నహ్ల్, ఆయత్90].
మరోచోట ఇలా ఉపదేశించెను: “ప్రజల మధ్య తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి”[సూరయె నిసా, ఆయత్58]
చాలా ఆయత్ మరియు రివాయతులలో మాట మరియు నడవడికలో న్యాయంగా ఉండాలని ఆజ్ఞాపించబడింది. అల్లాహ్ కొన్ని సందర్భాలలో దుర్మార్గులను స్పష్టంగా, నేరుగా “లఅనత్” చేశాడు.

అన్యాయం మరియు దుర్మార్గ:
అల్లాహ్ తన గ్రంథంలో చాలా సార్లు అన్యాయం మరియు దుర్మార్గం గురించి సూచించెను. ఈ గుణం చాలా చెడ్డ గుణం.
అనుభవం ద్వార తెలిసే యదార్థమేమిటంటే; అన్యాయపు కోట ఎంత బలమైనదైనా సరే, అది నిత్యం స్థిరత్వం కలిగివుండదు, ఈరోజు కాకపోతే రేపు ఆ దుర్మార్గుల పై కూలిపోతుంది. అల్లాహ్ ఇలా సూచించెను: “అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు”[సూరయె అన్ఆమ్, ఆయత్144]

మాసూముల వచనానుసారం: “రాజ్యాధికారాలు అవిశ్వాసంతో మిగిలి ఉంటాయి కాని అన్యాయం మరియు దుర్మార్గం ద్వార మిగిలి ఉండవు.(నాశనం అవుతాయి).  

మానవ హక్కులు:
అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో ఇలా ఉపదేశించెను: “వాస్తవానికి మేము ఆదం సంతతిని గౌరవం వొసగాము”[సూరయె ఇస్రా, ఆయత్70]. అనగా అందరిని గౌరవించాలి. మన ప్రవర్తనగాని లేదా మన మాటలు గాని ఎదుటివారిని అగౌరపరిచే లేదా నిరాశ పరిచే విధంగా ఉంకూడదు.

మరో చోట ఇలా ఉంది: “ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన వహీ ప్రకారం తీర్పు చెయ్యరో వారే (కరడుగట్టిన) అవిశ్వాసులు”[సూరయె మాయిదహ్, ఆయత్44]. అంటే ధర్మానికి కట్టుబడి ఉండాలి, దాని అనుసారం అమలు చేయాలి.

మరో చోట ఇలా ఉపదేశించెను: “ఎవరైనా ఒకరి హత్యకు ప్రతీకారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినైనా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు”[సూరయె మాయిదహ్, ఆయత్ 32].

అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “తీర్పు(దినము)ను ధిక్కరించే వాడిని నీవు చూశావా?! వీడే అనాధను గెంటివేసేవాడు. నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం (ఇతరులకు) ప్రేరేపించనివాడు. ఆ నమాజీలకు వినాశం తప్పదు (వైల్ అనే నరక స్థానం వారికొరకు ఉన్నది). (ఎందుకంటే) వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. వారు (ఒకవేళ నమాజు చేసినా) పరులకు చూపటానికి చేస్తారు. అతి సామాన్యమైన వాడుక వస్తువులు సయితం ఇవ్వటానికి వారు నిరాకరిస్తారు”[సూరయె మాఊన్, ఆయత్1-7].

నిజమైన ధర్మం యొక్క సంకేతాలు
మానవుడు ఒక ధర్మాన్ని ఆచరించి తన జీవితాన్ని గడపడం అవసరం. కాని మన లోకంలో ఎన్నో ధర్మాలు ఉన్నాయి. ఏ ధర్మాన్ని ఆచరించాలో సాధారణ స్వభావం కలిగివున్న వారికి తెలియదు. వారి కోసం ఇక్కడ నిజమైన ధర్మం యొక్క సంకేతాలను వివరిస్తున్నాము:
1. నిజమైన ధర్మం, బుద్ధివివేకాలకు అనుకూలంగా ఉంటుంది
ఖుర్ఆన్ ఇలా సూచిస్తుంది: వారితో అతనిలా అన్నాడు: “ఏమిటి? మీరు (మీ స్వహస్తాలతో) చెక్కిన శిలలను పూజిస్తారా?”[సూరయె సాఫ్ఫాత్, ఆయత్95]
2. నిజమైన ధర్మం, సృష్టికర్త తరపు నుంచి నియమించబడి ఉండాలి ఇతరుల తరపు నుంచి కాదు.
3. నిజమైన ధర్మం, మానవుల అవసరాలన్నింటిని తీర్చే ప్రణాళిక కలిగి ఉండాలి; దేహఆత్మల పరంగా, ఇహపరలోకాల పరంగా, వ్యక్తీ మరియు సమాజ పరంగా.
4. నిజమైన ధర్మం, దాని అనుచరణ వల్ల మనిషిలో సమర్థత, అభివృద్ధి పొందాలి. కాలం గడిచే కొద్ది అది పాతపడిపోకూడదు, దాని ఆదేశాలు నిత్యం తాజాగా మరియు ఆకర్షనియమైనవిగా ఉండాలి.

అంతిమ దైవప్రవక్త అయిన హజ్రత్ ముహమ్మద్(స.అ) యొక్క మనవడు హజ్రత్ ఇమామ్ హుసైన్(అ.స) ఇలా ప్రవచించారు: “ఎట్టి పరిస్థితిలోనూ అవమానాన్ని స్వీకరించను, నేనూ మరియు నా సంతానం చంపబడినా సరే” ఈ శ్లోకం అన్ని కాలాలలో అన్ని ప్రదేశాలలో మరియు మానవులందరికీ నచ్చేటువంటి శ్లోకం. ఇది పాతది కానటువంటి శ్లోకం. [2]

రిఫరెన్స్
1. తబాతబాయి, ముహమ్మద్ హుసైన్, తఆలీమె ఇస్లాం, పేజీ225.
2. ఆష్నాయీ బా ఇస్లాం బరాయె నౌజవానాన్, మొహ్సిన్ ఖిరాఅతీ, మర్కజె తహ్ఖీఖాతె రాయానయి ఖాయిమియహ్ ఇస్ఫెహాన్, పేజీ15.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13