హజ్రత్ అబ్బాస్(అ.స) యొక్క ప్రతిష్ఠత

మంగళ, 02/20/2024 - 04:05

హజ్రత్ అలీ(అ.స) మరియు ఉమ్ముల్ బనీన్(అ.స) దంపతులకు జన్మించిన మొదటి సంతానం హజ్రత్ అబ్బాస్(అ.స) బిరుదుల వివరణ సంక్షిప్తంగా...

హజ్రత్ అబ్బాస్(అ.స) యొక్క ప్రతిష్ఠత

నిస్సందేహముగా మనిషి యొక్క అస్తిత్వం మరియు పవిత్రత అతడి ఆధ్యత్మిక పవిత్రతో ముడి పడి ఉంటుంది. ఇస్లాం మరియు ఖుర్ఆన్ కరీమ్ అనుసారం పవిత్రత మరియు విద్య మనిషి యొక్క స్థిరత్వాలు మరో విధంగా చెప్పాలంటే ఒకవేళ మనిషి యొక్క వికర్షణ మరియు ఆకర్షణ శక్తి క్షిణిస్తే ఆ మనిషి నాశనం వైపుకు చేరినట్లే ఎందకుంటే మనిషి అభివృద్ధి ఈ రెండు శక్తుల పై ఆధారాపడి ఉన్నాయి, మనిషి వికర్షణ శక్తి అతడ్ని అల్లాహ్ పట్ల అవిధేయత మరియు పాపములు చేయకుండా ఆపుతుంది, ఆకర్షణ శక్తి మనిషి యొక్క పరిపూర్ణతలు మరియు విలువలు ఉదా; విశ్వాసం, విద్య, ఉత్తమ చర్యలాంటి మంచి లక్షణాలతో తనను అలంకరించుకోమని చెబుతూ ఉంటుంది.

సాధారణంగా మనిషి తన ధర్మనిష్ఠ శక్తులను ఉపయోగించి తనలో ఉన్న ఆత్మను పాపముల నుండి ఖాలీ చేసి, స్వియాన్ని సద్గుణలతో అలంకరించాలి దాంతో అల్లాహ్ మరియు పరలోక సంపూర్ణత్వాలు అతడి అస్తిత్వంలో వెళ్లడించబడతాయి, అలా దాసుడు తన సృష్టి యొక్క అసలైన లక్ష్యం అనగా అల్లాహ్ యొక్క దాసోహం మరియు విధేయతకు చేరుకుంటాడు. ఇటువంటి గొప్పస్థానం పొందిన వారిలో ఒకరు హజ్రత్ అబుల్ ఫజ్లిల్ అబ్బాస్(అ.స) ఒకరు.

హజ్రత్ అలీ(అ.స) మరియు ఉమ్ముల్ బనీన్(అ.స) దంపతులకు జన్మించిన మొదటి సంతానం హజ్రత్ అబ్బాస్(అ.స). ఇక్కడ వారి కున్నియతుల గురించి ఇక్కడ సంక్షిప్త రూపంలో తెలుసుకుందాం.

1. అబుల్ ఫజ్లిల్
హజ్రత్ అబుల్ ఫజ్లిల్ అబ్బాస్(అ.స) యొక్క ఈ కున్నియత్ వారి తండ్రి హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) మాధిరిగా వారి ప్రతిష్ఠలు మరియు ప్రత్యేకతల వల్ల వారిని అబూతురాబ్ అని అనే వారు మరియు ఇతనిని అబుల్ ఫజ్లిల్. నిస్సందేహాంగా జీవితం యొక్క వివిధ స్థాయి అనగా బాల్యం మరియు యవ్వన కాలంలో వారి లెక్కలేనివన్ని ప్రతిష్ఠతలకు ప్రతి రూపం,[1] చరిత్ర కారులనుసారం వారిని ఈ కున్నియత్ ద్వార పిలవడానికి రెండు కారణాలున్నాయి.
అ) వారికి ఫజ్ల్ పేరు గల అబ్బాయి ఉండి ఉండొచ్చు.
ఆ) వారి పూర్తి జీవితం ప్రతిష్ఠితలతో కూడి ఉండి ఉండొచ్చు ఎందుకంటే అబుల్ ఫజ్ల్ అనగా ప్రతిష్ఠతల తండ్రి.

దీని ద్వార రెండవ కారణమే సరైనది అని తెలుస్తుంది.

2. అబుల్ ఖాసిమ్
అబుల్ ఖాసిమ్ హజ్రత్ అబ్బాస్ యొక్క మరో కున్నియత్ గొప్ప సహాబీ అయిన జాబిర్ ఇబ్నె అబ్దుల్లాహ్ అన్సారీ, అర్బయీన్ సందర్భంలో హజ్రత్ అబుల్ ఫజ్లిల్ అబ్బాస్ ను ఉద్దేశిస్తూ ఇలా సలామ్ చేశారు.. అస్సలాము అలైక యా అబల్ ఖాసిమ్, అస్సలాము అలైక యా అబ్బాస్ ఇబ్నె అలీ[2].

3. అబుల్ ఖిర్బహ్
ఈ కున్నియత్ హజ్రత్ అబ్బాస్(అ.స) యొక్క మరో కున్నియత్ ఇందులో వీరత్వం మరియు శౌర్యం కనిపిస్తుంది. శత్రు సైన్యాన్ని చీల్చుకుంటూ నది ఒడ్డుకు చేరి నీళ్లు తన చేతుల్లో తీసుకొని, డేరాలలో దాహంతో అల్లాడుతున్న పిల్లల దాహాన్ని తీర్చడానికి నీళ్లు నింపుకోవడం మామూలు విషయం కాదు.[3]

దాహంతో ఉన్న వారికి నీళ్లు త్రాగించడం చాలా మంచి పని, ఇది మానవత్వానికి నిదర్శనమైన పని, కర్బలాలో ఈ పని హజ్రత్ అబుల్ ఫజ్లిల్ అబ్బాస్ యొక్క అతి ముఖ్యమైన చర్యలలో ఒకటి. చివరికి వారు దీన్ని అమలు పరిచే క్రమంలోనే వీరమరణం పొందారు. వారు దాహంతో అల్లాడుతున్న పిల్లల దాహాన్ని తీర్చడానికి కై కాలువ వద్దకు నీళ్లు తీసుకొని రావడానికి వెళ్లారు కాని శత్రు సైన్యం వారిని చుట్టు ముట్టి చంపారు.

4. ఖమరె బనీ హాషిం
చరిత్ర మరియు మఖాతిల్ గ్రంథాలలో హజ్రత్ అబుల్ ఫజ్లిల్ అబ్బాస్(అ.స) చాలా అందంగా ఉండేవారని వ్రాశారు, అందుకని వారిని “ఖమరె బనీ హాషిం” అని అనేవారు. కొందరు వారి ప్రతిష్ఠతల మరియు వారి గొప్పతనం వల్ల ఈ బిరుదు వారికి ఇచ్చారు.

5. బాబుల్ హవాయిజ్
ఈ బిరుదు ఇవ్వడానికి గల కారణ హజ్రత్ అబుల్ ఫజ్లిల్ అబ్బాస్(అ.స) ఆషూర్ రోజున ఖుర్బానీ, త్యాగం, చిత్తశుద్ధి, మానవ ప్రతిష్ఠత మరియు ఇమామ్ పట్ల విధేయతకు ప్రతిరూపంతో ఉండడం వల్ల అల్లాహ్ వారికి “బాబుల్ హవాయిజ్” స్థానాన్ని ప్రసాదించెను, వారి ద్వార దుఆలు స్వీకరించబడతాయి ఎందుకంటే వారి షిఫాఅత్ అల్లాహ్ సానిధ్యంలో అర్హత కలిగినది.[4]

రిఫరెన్స్
1. అన్నాసిరీ వల్ బహ్రైనీ, మొహమ్మద్ అలీ, మౌలిద్ అల్ అబ్బాస్ ఇబ్నె అలీ, పేజీ56.
2. ఖుమ్మీ, షేఖ్ అబ్బాస్, మఫాతీహుల్ జినాన్, జియారతె అర్బయీన్ మన్సూబ్ బె జాబిర్ ఇబ్నె అబ్బాస్ అబ్దుల్లాహె అన్సారీ.
3. ముజఫ్ఫర్, అల్ షేఖ్ అబ్దుల్ వాహిద్, బతలల్ అల్ ఖమా అల్ అబ్బాస్ అల్ అక్బర్ ఇబ్నె అమీరిల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స), భాగం2, పేజీ8.
4. https://ur.btid.org/node/8051

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 52