ఇస్లాం దృష్టిలో కొన్ని అంశాలు అసలైన అపవిత్రాలు వాటి ద్వారానే వేరే వస్తువులు అపవిత్రం అవుతాయి.
ఇస్లాం దృష్టిలో కొన్ని అంశాలు అసలైన అపవిత్రాలు వాటి ద్వారానే వేరే వస్తువులు అపవిత్రం అవుతాయి.
ముందుగా ఒక సూత్రంతో మొదలు పెడదాం, ఇది ప్రతీ ముస్లిం యొక్క జీవితంలో ప్రత్యేక ప్రభావాన్ని చూపేటువంటి ఒక సూత్రం, అదేమిటంటే “کُلُّ شیء طاهر” అనగా ప్రతీదీ పవిత్రమైనది. ప్రతీది అనగా సముద్రం, వర్షం, చెట్లు, మార్గాలు, కట్టడాలు, ఇంటి సామానులు, ఆయుధాలు, బట్టలు మరియు ముస్లిం సోదరులు మొ॥ ప్రతీదీ శుభ్రమైనవి కాని ఏవైతే స్వభావ పరంగా, ఉనికి పరంగా, ఫిత్రత్ పరంగా నజిస్(అశుద్ధం) గా ఉన్నాయో ఆ పది అంశాలు తప్ప, అవి క్రమంగా:
1, 2. మనిషి యొక్క మల మూత్రాలు:
మరియు తినడం హరామ్ గా నిషేధించబడ్డ మరియు “జహిందా రక్తం” కలిగివున్న ప్రతీ జంతువు మల మూత్రాలు.
“జహిందా రక్తం”, ఇదొక ప్రత్యేక పదం, ఇది ఈ టాపిక్ లో నీకు చాలా సార్లు ఎదురుపడుతుంది, అందుకని దీని గురించి నీకు ఇప్పుడే వివరించడం మంచిది.
ఎప్పుడైతే మనం “ఈ జంతువు జహిందా రక్తం కలిగి ఉంది” అని అంటామో దానిని అర్థమేమిటంటే ఆ జంతువును జపా చేసేనప్పుడు దాని రక్తం వేగంగా బయటకు వస్తుంది. ఎందుకంటే వీటిలో జహిందా సిరలు ఉన్నాయి కాబట్టి ఉదా: కోడి మొ॥
ఎప్పుడైతే మనం “ఈ జంతువు జహిందా రక్తం కలిగిలేదు” అని అంటామో దానిని అర్థమేమిటంటే ఆ జంతువును జపా చేసేనప్పుడు దాని రక్తం నెమ్మదిగా, మెల్లగా మరియు క్రిదకు పారుతుంది. ఎందుకంటే వీటిలో జహిందా సిరలు లేవు కాబట్టి ఉదా: చేప.
3. మర్దార్:
జపా సమయంలో రక్తం నెమ్మదిగా కాకుండా వేగంగా బయటకు వచ్చే ప్రతీ “ముర్దార్” జంతువు అది హలాహ్ మాంసపు జంతువైనా సరే, అలాగే ఆ జంతువు శరీరం నుండి తన జీవితంలో వేరు అయిన భాగాలు కూడా(నజిస్ అవుతాయి).
మర్దార్ అనగానేమి?
ఇస్లామీయ పద్ధతి ప్రకారం జపా చేయకుండా మరణించినవి. ఉదా: రోగంతో చచ్చిన లేదా యాక్సిడెంట్ ద్వార చచ్చింది లేదా షరా ప్రకారం కాకుండా కోసి చంపబడిన జంతువు, వీటన్నీంటిని ముర్దార్ అంటారు.
ప్రశ్న: మనిషి మరణించిన తరువాత అతడి శరీరం కూడా నజిసేనా(అపవిత్రం)?
సమాధానం: ఔను అతడి శరీరం నజిస్ అవుతుంది. షహీద్ మరియు ఎవరికైతే ఇస్లాం చట్టం ప్రకారం మరణ శిక్ష పడడం ద్వార తాను బ్రతికి ఉన్నప్పుడే గుస్ల్ ఇవ్వడం జరిగిందో వారి శరీరం నజిస్ కాదు.
ప్రశ్న: ఈ ఇద్దరు తప్ప ఇతర మనిషుల మృతదేహాలు నజిసేనా?
సమాధానం: కాదు, ముస్లిముల మృతదేహానికి మూడు సార్లు గుస్ల్ స్నానం చేయించిన తరువాత అవి పాక్(శుభ్రమైనవి) అవుతాయి. దీని గురించి తర్వాత వివరంగా మాట్లాకుందాం...
4. మనీ:
మనిషి మరియు జహిందా రక్తం కలిగివున్న ప్రతీ జంతువు యొక్క మనీ అది హలాల్ మాంసం కలిగివున్న జంతువు అయినా సరే.
5. రక్తం:
మనిషి మరియు జహిందా రక్తం కలిగివున్న ప్రతీ జంతువు శరీరం నుండి బయటకు వచ్చే రక్తం. జహిందా రక్తం కలిగిలేని జంతువుల రక్తం పాక్, ఉదా: చేప రక్తం.
6. కుక్క:
నేలపై నివశించే కుక్క యొక్క శరీరభాగాలన్నీ అది బ్రతికున్నా లేదా చనిపోయినా అవి నజిసే అయి ఉంటాయి.
7. పంది:
నేలపై నివశించే పంది యొక్క శరీరభాగాలన్నీ అది బ్రతికున్నా లేదా చనిపోయినా. సముద్రములో నివశించే కుక్కా మరియు పంది, ఈ రెండూ పాక్(శుద్ధమైనవి).
8. మద్యం:
మద్యం(మరియు మద్యం లాంటివి) ఉదాహారణకు ఫుఖా మొదలగువి నజిస్ (అశుద్ధమైనవి మరియు అపవిత్రమైనవి).
9. అవిశ్వాసి:
అవిశ్వాసి బ్రతికుండగా మరియు అతడి మృతదేహం (రెండూ) నజిస్ యే క్రైస్తవుడు, యూధుడు మరియు మజూసీ(అగ్న్యుపాసకుడు) కాకుండా.
10. నజాసత్ మరియు అశుద్ధాలు తినే జంతువు చెమట.
రిఫరెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, నజాసాత్ అధ్యాయం, ఫార్సీ అనువాదం.
వ్యాఖ్యానించండి