హైౙ్ కు సంబంధించిన మరి కొన్ని అంశాల సంక్షిప్త వివరణ...
ప్రశ్న: ఒకవేళ రక్తం 10 రోజులకు తక్కువగా లేదా ఎక్కువగా, ఆమె సాధరణ అలవాటుకు మించి పోతే ఆమె షరా పరమైన కర్తవ్యం ఏమిటీ?
సమాధానం: ఆ సమయంలో తనను హాయిజ్ గానే అనుకోవాలి, ఆ రక్తంలో హైౙ్ కు గల లక్షణాలు లేకపోయినా సరే.
ప్రశ్న: ఒకవేళ రక్తం పది రోజులకు దాటిపోయి, దాని సమయం మరియు సంఖ్య రెండూ స్థిరంగా ఉంటే?
సమాధానం: అయితే ఆమె కేవలం తన హైౙ్ యొక్క ప్రత్యేక రోజులలో మాత్రమే హాయిజ్‌గా భావించాలి, అలవాటు కు ముందు మరియు తరువాత రోజులు హైౙ్ రోజులుగా లెక్కించబడవు.
ప్రశ్న: అలవాటు గల స్త్రీకు తన అలవాటు సమయంలో రక్తం రాలేదు, ఆ అలవాటు ప్రకారం వచ్చే సమయం గడిచిన తరువాత రక్తం వచ్చింది, అది అలాగే పది రోజులకు మించి పోయింది, కొంత రక్తంలో హైౙ్ లక్షణాలు కనిపిస్తున్నాయి మరియు కొంత రక్తంలో హైౙ్ లక్షణాలు కనిపించడం లేదు, ఆమె ఆ రెండింటిలో దేన్ని హైౙ్ గా నిర్థారించుకోవాలి?
సమాధానం: వాటిలో ముందుగా వచ్చిన రక్తాన్ని హైౙ్ గా నిర్థారించుకోవాలి, అయితే అందులో తన మనుపటి అలవాటు కాలాన్ని పరిణగలో తీసుకోవాలి ఆ తరువాత రక్తంలో హైౙ్ లక్షణాలు ఉన్నన్ని రోజులు ఆమె అలవాటు కాలానికి తక్కువ అయి ఉంటే హైౙ్ రక్తం లక్షణాలు లేని మిగతా రోజులను అలవాటు కాలం వరకు హైౙ్ గానే భావించాలి. ఒకవేళ హైౙ్ లక్షణాలు ఆమె అలవాటు రోజులుకు మించి ఉంటే తన అలవాటు కాలం ప్రకారంగానే హైౙ్ అని నిర్థారించాలి.
ప్రశ్న: రక్తం పది రోజులకు మించి పోయి ఉంటే, అసలు ఆమె అలవాటు లేని స్ర్తీ అయి ఉంటే ఉదాహారణకు ముబ్తదిఅహ్; ముజ్తరిబహ్ మరియు ముతహయ్యరహ్ మొ॥ ఇలాంటి సమయంలో ఆమె హైజ్ రక్తం మరియు హైజ్ కాని రక్తాన్ని ఎలా తెలుసుకోగలుగుతొంది?
సమాధానం: వివిధ లక్షణాల ఆధారంగా, ఒకవేళ హైౙ్ లక్షణాలు కలిగివున్న రక్తం బయటకు రావడం మూడు రోజల మరియు పది రోజుల మధ్యలో గనక అయి ఉంటే ఆమె దానినే హైౙ్ గా నిర్ధారించుకోవాలి మరియు అది కాకుండా వచ్చే రక్తాన్ని ఇస్తిహాజాగా నిర్థారించుకోవాలి. ఇస్తిహాజా గురించి మున్ముందు వచ్చే చర్చలో వివరిస్తాను.
ప్రశ్న: ఒకవేళ స్ర్తీ హైౙ్ రక్తం రావడం ఆగిపోయింది అన్న విషయంలో సందేహానికి గురి అయింది అనగా తాను శుభ్రమయ్యిందా లేక ఇంకా హైౙ్ స్థితిలోనే ఉందా అని సందేహ పడుతున్నప్పుడు ఆమె ఏమి చేయాలి?
సమాధానం: ఆమె తప్పకుండా పరిశీంచాలి, అన్వేషణ ఆమె పై తప్పని సరి.
ప్రశ్న: ఆమె ఎలా పరిశోధిస్తుంది?
సమాధానం: ఆమె కొంచెం దూది తీసుకొని తన యోనిలో పెట్టి, కొంచెం సేపు వేచియుండి, ఆ తరువాత దాన్ని బయటకు తీయాలి, ఒకవేళ ఆ దూది తెల్లగానే ఉంటే ఆమె శుభ్రమైనట్లు, ఇక ఆమె గుస్ల్ స్నానం చేసి తన ఆరాధానలు ఉదా: నమాజ్, ఉపవాసం మొ॥ పాటించడం వాజిబ్ అవుతుంది, మరి ఒకవేళ దూది రక్తంతో నిండి ఉంటే లేదా రంగుతో ఉంటే మాత్రం ఆమె తనను హాయిజ్ గానే భావించాలి.
ప్రశ్న: స్ర్తీకి తాను హాయిజ్ అని తెలిసిందినప్పుడు ఆమె కర్తవ్యమేమిటి? ఆమెకు ఏ చర్యలు నిషిద్ధబడినవి?
సమాధానం: హైౙ్ స్థితిలో స్ర్తీ కు సంబంధించిన అహ్కాములు:
1. ఆమె వాజిబ్ నమాజ్ మరియు ముస్తహబ్ నమాజుల చదవడం సరి కాదు.
2. హైజ్ కాలంలో చదవని నమాజులకు ఖజా లేదు. (హైౙ్ నుండి శుభ్రమైన తరువాత వదిలేసిన నమాజులు చదవాల్సినవసరం లేదు).
3. ఉపవాస దీక్షలు నిర్వరించడం సరి కాదు.
4. రమజాన్ మాసంలో హైౙ్ సమయంలో నిర్వర్తించని ఉపవాస దీక్షలను ఖజా చేయాలి? (అలాగే ప్రత్యేక సమయంలో ఉపవాస దీక్ష మొక్కు (నజ్ర్) ఉంటే కూడా ఖజా ఉపవాసాన్ని నిర్వర్తించాలి.)
5. ఇలాంటి స్థితిలో హజ్ యొక్క వాజిబ్ లేదా ముస్తహబ్ ప్రదక్షణలు చేయడం సరి కాదు.
6. హైౙ్ కాలంలో విడాకులు తీసుకోవడం సరికాదు, అయితే కొన్ని సందర్భాలలో అనుమతి ఉంది.
7. హైౙ్ స్థితిలో ఉన్న స్ర్తీతో సంభోగం చేయడం నిషిద్ధమైనది(హరామ్), ఆ రక్తం ఆగిపోయిన తరువాత గుస్ల్ కు ముందు సంభోగం చేయవచ్చు (యోనిని కడుక్కున్న తరువాత)
8. హైౙ్ స్థితిలో ఉన్న స్ర్తీపై కూడా ముజ్నిబ్ వ్యక్తి పై హరామ్ గా నిర్ధారించబడిన చర్యలు(జనాబత్ చర్చలో చూడగలరు) హరామ్ గా నిర్ధారించబడ్డాయి.
9. హైౙ్ కాలం పూర్తయిన తరువాత ఆమె నమాజ్ కోసం గుస్ల్ స్నానం చేయడం వాజిబ్ అవుతుంది.
తరువాత వచ్చే గుస్ల్ చర్చలో గుస్ల్ స్నానం ఎలా చేస్తారు అన్న విషయాన్ని నీకు వివరిస్తాను.
రిఫరెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ముతహ్హిరాత్ అధ్యాయం, ఫార్సీ అనువాదం.
వ్యాఖ్యానించండి