నమాజె జనాజా

గురు, 02/29/2024 - 10:13

నమాజె జనాజా మరియు సమాధికి సంబంధించిన కొన్ని అంశాల గురించి సంక్షిప్త వివరణ...

నమాజె జనాజా

ప్రశ్న: మృతుడికి గుస్ల్, కఫన్ మరియు హనూత్ చేసిన తరువాత ఏమి చేయాలి?
సమాధానం: ఆ తరువాత మృతుడి కోసం నమాజ్ చదవడం వాజిబ్, మృతుడు పిల్లాడైనా సరే; ఎందుకంటే 6 సంవత్సరాల పిల్లాడి పై నమాజ్ చదవడం వాజిబ్ కాబట్టి.

ప్రశ్న: మృతుడి కోసం చదివే నమాజ్ (జనాజా నమాజ్) పద్ధతి ఏమిటి?
సమాధానం: జనాజా నమాజ్, ప్రతీ రోజు చదివే నమాజ్ కు భిన్నంగా ఉంటుంది, ఇందులో ఐదు తక్బీర్ లు ఉంటాయి. ఇందులో సూరహ్ లు చదవవలసి ఉండదు, రుకూ ఉండదు, సజ్దాలు ఉండవు, తషహ్హుద్ మరియు సలామ్ ఉండదు. మొదటి నాలుగు తక్బీర్లలో ఏదో ఒక తక్బీర్ తరువాత మృతుడి కోసం దూఆ చేయాలి, మిగిలిన వాటిలో దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్(స.అ) పై దురూద్, విశ్వాసుల కోసం దుఆ మరియు అల్లాహ్ యొక్క హంద్(స్తుతి)లో క్రమంగా ఏదైనా చదువకోవచ్చు.

ప్రశ్న: క్లుప్తంగా వాటిని వివరించండి.
సమాధానం: మొదట తక్బీర్ చెప్పి దాని తరువాత షహాదతైన్ చదువు, రెండవ తక్బీర్ చెప్పి ఆ తరువాత దైవప్రవక్త(స.అ) పై దురూద్ పంపు, మూడవ తక్బీర్ తరువాత మోమినీన్(విశ్వాసుల) కోసం దుఆ చేయి, నాలుగోవ తక్బీర్ తరువాత మృతుడి కోసం దుఆ చేయి ఆ తరువాత ఐదవ తక్బీర్ తో నమాజ్ ను పూర్తి చేయి.

ప్రశ్న: జనాజా నమాజ్ లో ఏవైనా షరత్తులు ఉన్నాయా?
సమాధానం: ఔను కొన్ని షరత్తులు ఉన్నాయి:
1. సందేహం లేకుండా స్పష్టంగా మయ్యత్ యొక్క నియ్యత్ ను చేయాలి.
2. ఖియామ్(నిలబడే) శక్తి ఉంటే నిలబడాలి.
3. జనాజా నమాజ్ ను గుస్ల్, కఫన్ మరియు హనూత్ తరువాత చదవాలి.
4. ఎటువంటి బలవంతం లేకుండా ఉంటే నమాజ్ చదివాడు ఖిబ్లాకు అభిముఖంగా ఉండాలి.
5. నమాజ్ చదువుతున్నావాడి ముందు మృతుడు ఉండాలి.
6. మృతుడి తల నమాజ్ చదివేవాడి కుడి వైపు ఉండాలి మరియు కాళ్లు ముసల్లీ యొక్క ఎడమ వైపు ఉండాలి.
7. జనాజా నమాజ్ సమయంలో మృతుడ్ని వీపుపై పడుకోబట్టాలి.
8. నమాజ్ చదివేవాడు మరియు మృతుడి మధ్య ఏదీ అడ్డుగా ఉండకూడదు ఉదాహారణకు పరదా లేదా గోడ మొ॥ అయితే మృతుడు తాబూత్(శవ పేటిక)లో ఉంటే లేదా మధ్యలో వేరే మృతదేహం ఉంటే పరవాలేదు.
9 మృతదేశం మరియు నమాజ్ చదివే వాడి మధ్య ఎక్కువ గ్యాప్ ఉండకూడదు, అలాగే వారిలో ఒకరు మరొకరి కన్నా చాలా ఎత్తులో కూడా ఉండకూడదు. ఒకవేళ నమాజ్ ను జమాఅత్ తో చదివినట్లైతే వరుసల కారణంగా దూరం ఏర్పడితే పరవాలేదు లేదా ఒకే సారి కొన్ని జనాజా నమాజులు చదువు తుండగా ఇతర జనాజాల వల్ల దూరం ఏర్పడినా పరవాలేదు.
10. మృతుడి సంరక్షకుడు (ఉదా: తండ్రి లేదా కొడుకు) నుండి నమాజ్ చదివించడానికి అనుమతి తీసుకోవడం.
11. నమాజ్ లో తక్బీరాత్, దుఆలు మరియు స్మరణలు ఒకటి తరువాత ఒకటి చదవాలి అనగా మధ్యలో ఎక్కువ గ్యాప్ రాకూడదు.

ప్రశ్న: జనాజా నమాజ్ చదివేవాడి శుభ్రత, ఉజూ, గుస్ల్ లేదా తయమ్ముమ్ లను షరత్తుగా ఎందుకు చెప్పలేదు?
సమాధానం: ఎందుకంటే జనాజా నమాజ్ లో శుభ్రత (తహారత్) వాజిబ్ కాదు కాబట్టి.

ప్రశ్న: జనాజా నమాజ్ పూర్తయిన తరువాత ఏమి చేయాలి?
సమాధానం: మృతుడ్ని పూడ్చడం వాజిబ్ కాబట్టి భూమిలో కనిపించకుండా పూడ్చబడింది అనడానికి ఈ రెండు చర్యలు పటిష్టంగా జరిగితే చాలు.
1. అక్కడ జంతువులు ఉంటే ఆ దేహం వాటి నుండి సురంక్షితంగా ఉండాలి.
2. దాని వాసన ప్రజలకు రాకుండా ఉండాలి అనగా ఒక వేళ అక్కడ ఎవరైనా ఉంటే వారికి దాని వాసన ద్వార కష్టం కలిగినట్లైతే.

మృతుడ్ని సమాధిలో కుడి వైపుకు, అతడి దేహం యొక్క ముందు భాగం ఖిబ్లా కు అభిముఖంగా ఉండేటట్లు పడుకోబెట్టాలి.
ప్రశ్న: పుడ్చబెట్టే ప్రదేశం గురించి ఇంకా ఏమైనా షరత్తులు ఉన్నాయా?

సమాధానం: ఔను ఉన్నాయి;
1. సమాధి చోటు ముబాహ్ అయి అండాలి కబ్జా చేసిన స్థలం అయి ఉండకూడదు. ఒక ప్రత్యేక దాని కోసం వఖ్ఫ్ చేయబడి ఉండకూడదు, ఉదాహారణకు మస్జిదులు, మద్రసాలు మరియు ఇమామ్ బాడాలు మొ॥ ఇలా చేయడం ద్వార ఆ వఖ్ఫ్ ప్రదేశాలకు నష్టం కలిగే లేదా వఖ్ఫ్ కోసం కష్టానికి కారణం అవుతుంది అన్నప్పుడు ఇంకా చెప్పాలంటే నష్టం మరియు కష్టం కాకపోయినా సరే అక్కడ పూడ్చకూడదు.
2. ముస్లిముల మృత దేహం సమాధి చేసే చోట సమాధి చేయాలి, మృతుడికి కించపరిచే లేదా అగౌరపరిచే చోటు పూడ్చ కూడదు ఉదాహారణకు మరగు దొడ్ల లేద పెంటలు వేసే చోటు.
3. అవిశ్వాసుల స్మశానంలో సమాధి చేయకూడదు.

ప్రశ్న: సమాధి చేసిన తురవాత చర్యల గురించి చెప్పండి.
సమాధానం: దైవప్రవక్త(స.అ) నుండి రివాయత్ ఉల్లేఖించబడి ఉంది, వారు ఇలా ఉపదేశించారు: మరణించినవాడి పై మొదటి రాత్రికి మించిన కష్టం ఉండదు, అయితే మీ మృతుల పై సద్ఖా దానం చేసి దయ చూపండి, ఒకవేళ నీకు ఇలా చేసే శక్తి లేకపోతే అతడి కోసం రెండు రక్అతుల నమాజ్ ను చదువు మొదటి రక్అత్ లో అల్ హంద్ తరువాత ఆయతులుల్ కుర్సీ మరియు రెండవ రక్అత్ లో అల్ హంద్ తరువాత పది సార్లు ఖద్ర్ సూరహ్ ను చదువు ఆ తరువాత ఇలా అను “అల్లాహుమ్మ సొల్లి అలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్ వబ్అస్ సవాబిహా ఇలా ఖబ్రీ ఫులాన్” ఫులాన్ కు బదులు మరణించిన వ్యక్తి పేరు చెప్పాలి.

రిఫరెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ముతహ్హిరాత్ అధ్యాయం, ఫార్సీ అనువాదం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13