ఉజూ యొక్క అహ్కాములు

సోమ, 03/04/2024 - 13:48

కొన్ని వాజిబ్ చర్యలు అమలు పరచడానికి ఉజూ చేయడం అవసరం అందుకని దాన్ని ఎలా చేయాలి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

ఉజూ యొక్క అహ్కాములు

ప్రశ్న: మేము ఉజూ ఎందుకు చేయాలి?
సమాధానం: నమాజ్ చదివేందుకు. ఉదాహారణకు మేము అల్లాహ్ గృహ దర్శనం అయిన హజ్ మరియు ఉమ్రా సమయంలో తవాఫ్ చేయడానికి. మేము ఖుర్ఆన్ యొక్క అక్షరాలు, అల్లాహ్ యొక్క పేర్లు మరియు ఆయన ప్రత్యేక సిఫాత్(పేర్లు) ఉదా: ఖాలిఖ్, రహ్మాన్ మొ॥ వాటిని తాకేందు.

ప్రశ్న: మేము సాధారణంగా నీళ్లతో నే ఉజూ చేస్తాము, అయితే ఈ నీళ్లకు కూడా ఏమైనా షరతులు ఉన్నాయా?
సమాధానం: ఔను! ఈ నీళ్లకు కూడా కొన్ని షరతులు ఉన్నాయి:
1. నీళ్లు శుభ్రమైన నీళ్లు అయి ఉండాలి, ఉజూ చేసే శరీర భాగాలు కూడా శుభ్రమై ఉండాలి, తత్హీర్ కోసం నీళ్లను ఉజూ భాగాలకు పూర్తిగా చేరే విధంగా వేసుకుంటే చాలు.
2. నీళ్లు ముబాహ్ అయి ఉండాలి (కబ్జా చేసినవి ఉండకూడదు) మరియు ఇదే విధంగా ఎక్కడ అయితే కూర్చోని ఉజూ చేయబడుతుందో ఆ చోటు కూడా ముబాహ్ అయి ఉండాలి. ఉజూ చేసే ప్రదేశం ముబాహ్ అయి ఉండాలి అనే షరతు గురించి తప్పుకుండా తెలుసుకోవాలి; ఉజూ చేసే ప్రదేశం కబ్జా భూమి అయితే అనగా కబ్జా భూమి తప్ప వేరే భూమి పై ఉజూ చేయడం సాధ్యం కాకపోతే ఉజూ చేయకూడదు. ఇలాంటి సమయంలో నీ పై తయమ్ముబ్ వాజిబ్ అవుతుంది. అయితే ఒకవేళ ఈ ఆదేశాన్ని వ్యతిరేకించి ఆ కబ్జా భూమి పై ఉజూ చేసుకుంటే ఆ ఉజూ సరైనదే కాని నువ్వు పాపం చేసినవాడివి అవుతావు.
3. నీళ్లు ముత్లఖ్ నీళ్లు అయి ఉండాలి ముజాఫ్ నీళ్లు అయి ఉండకూడదు; ఉదాహారణకు పారే నీళ్లు, బిందేలో ఉన్న త్రాగే నీళ్లు అయి ఉండాలి దానిమ్మ పండు నీళ్లు (జూస్) అయి ఉండకూడదు.

ప్రశ్న: నేను ఉజూ ఎలా చేయాలి?
సమాధానం: ఖుర్బతన్ ఇలల్‌ల్లాహ్ (అల్లాహ్ సామిప్యం) నియ్యత్ చేసి మొదలు పెట్టాలి.

ముందుగా ముఖం పొడవు నొసలు నుండి తల వెంట్రుకలు మోలిచే ప్రదేశం నుండి గెడ్డం వరకూ, వెడల్పు బ్రొటన వ్రేలు మరియు మధ్య వ్రేలు మధ్యలో ఎంత భాగం పడితే అంత భాగాన్ని కడుక్కోవాలి. చేయిని విప్పి ముఖం మీద పెట్టుకోండి, మీ ముఖ భాగాన్ని అరచే బ్రొటన వ్రేలు మరియు మధ్య వ్రేలు ఆక్రమించుకుంటుందో అంత వెడల్పు భాగాన్ని కడగడం వాజిబ్ అవుతుంది.
అయితే గమనించ వలసిన విషయమేమిటంటే ముఖాన్ని పైనుండి క్రింది వైపుకు (మాత్రమే) కడగాలి. గుర్తుపెట్టుకో దట్టంగా మరియు ఎక్కువగా ఉన్న వెంట్రుకల (మొదలు)లో నీళ్లను చేర్చడం అవసరం లేదు.

రెండవది: చేతులను మోచేయి నుంచి చేయి వ్రేళ్ల చివరి వరకు కడగాలి, ముందు కుడి చేయి ఆ తరువాత ఎడమ చేయి, పైనుంచి వ్రేళ్ల చివరి వరకు.
ప్రశ్న: మోచేయి దేన్ని అంటారు?
సమాధానం: చేయి(క్రింది భాగం) మరియు భూజానికి చోడించే స్థానం.

మూడవది: కుడి వైపు మోచేయి ద్వార తల యొక్క ముందు భాగాన్ని మసహ్ చేయాలి మరియు మసహ్ పై నుండి క్రింది వైపుకు చేయాలి. తల యొక్క ముందు భాగంలో ఉన్న వెంట్రుకల పై మస్‌హ్ చేస్తే సరిపోద్ది, పూర్తి తలపై మస్‌హ్ చేయడం వాజిబ్ కాదు.

నాలుగొవది: రెండు కాళ్ల మస్‌హ్ ఇది కాళ్ల వ్రేలు మొదలు నుండి కాళ్ల ఎత్తు భాగం వరకు, ముందు కుడి కాలి మసహ్ కుడి చేతిలో ఉన్న తడితో ఆ తరువాత ఎడమ కాలి మసహ్ ను ఎడమ చేచిలో ఉన్న తడితో చేయాలి. వేరే నీళ్లతో మసహ్ చేయడం సమ్మతమైనది కాదు.  

క్రింద ఇవ్వబడిన వివరాలనుసారం చూడండి
అ) క్రమం (తర్తీబ్)
ముఖాన్ని కుడి చెయ్యి కన్నా ముందు కడుక్కోవాలి, ఎడమ చెయ్యి కన్నా ముందు కుడి చేయ్యి కడుక్కోవాలి, కాళ్ల యొక్క మస్‌హ్ కన్నా ముందు తల యొక్క మస్‌హ్ చేయాలి.

ఆ) మవాలాత్
మవాలాత్ అనగా ఉజూ చర్యలను ఒకటి తరువాత మరొకటి క్రమంగా చేయాడం, ఒకవేళ పరిస్థితుల వల్ల ఉజూ చర్యల మధ్యలో గ్యాప్ వస్తే, ఉదా: నీళ్లు అయిపోతే లేదా మరిచిపోతే, ఇలాంటి పరిస్థితిలో ఏ భాగం అయితే కడుగుతున్నావో లేదా మసహ్ చేస్తున్నావో దానికి ముందు కడగిన లేదా మసహ్ చేసిన భాగం పొడిగా అవ్వకపోతే చాలు (అంటే ఇలాంటి సమయంలో ఆ ఉజూ సరైనది). ఒకవేళ భాగాలన్నీ పొడిగా అయిపోయినట్లైతే ఆ ఉజూ బాతిల్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పడం మంచిది; ఒకవేళ వేడి గాలి లేదా శరీర వేడి వల్ల భాగాలు పోడిగా మారితే పరవాలేదు అయితే ఉజూ చర్యలలో గ్యాప్ వచ్చింది అని అనబడకూడదు అప్పుడు అది సరైనదే.
సాధ్యమైనంత వరకు ఉజూను స్వయంగానే చేసుకోవాలి ఇతరుల సహాయంతో చేయకూడదు.

ప్రశ్న: ఒకవేళ స్వయంగా ఉజూ చేసుకోలేకపోతే?
సమాధానం: నీకు ఉజూ చేసుకునే శక్తి లేకపోతే ఇతరుల సహాయం తీసుకోవచ్చు; ఎలాంటి సహాయం అంటే అతడు నీ చేయిని లేపి నీ ముఖాన్ని కడిగించడం, ఆ తరువాత నీ చేతులను కడిగించడం, కుడి చేత్తో తల మసహ్ ను చేయించడం ఆ తరువాత రెండు కాళ్ల మసహ్ ను రెండు చేతుల తడితో చేయించడం.

ఇ) ఉజూ నీళ్లు ఉజూ భాగాలకు చేరకుండా అడ్డు ఉండకూడదు ఉదాహారణకు రంగు లేదా ఉంగరం మొ॥

ఈ) నీళ్లు ఉపయోగించడం అడ్డంకంగా నిర్థారించబడినప్పుడు, ఉదా: ఏదైనా రోగం, వేరే ఏదైనా అడ్డంకం ఏర్పడితే అప్పుడు నీపై ఉజూకు బదులుగా తయమ్ముమ్ వాజిబ్ అవుతుంది.
ప్రశ్న: నేను ఉజూ చేసుకున్నాను ఆ తరువాత నమాజ్ సమయం అయ్యింది, అప్పుడు నేను మరో సారి ఉజూ చేయాలా?
సమాధానం: నీ ఉజూ బాతిల్ అవ్వనంత వరకు నీ పై ఉజూ చేయడం వాజిబ్ కాదు.

ప్రశ్న: ఉజూ ఎలా బాతిల్ అవుతుంది?
సమాధానం: ఉజూ ఏడు విధాలుగా బాతిల్ అవుతుంది; మూత్ర విసర్జన, మల విసర్జన, నిద్ర, ఆలోచన శక్తి గతిస్తే ఉదా: సొమ్మశిల్లి పోవడం, మత్తు; ఇస్తిహాజా ఖలీలహ్ మరియు ముతవస్సితహ్ మొ॥(ఇస్తిహాజా మరియు జనాబత్ చర్చలో చూడగలరు).

రిఫరెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ఫార్సీ అనువాదం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 14 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14