నరకవాసులతో స్వర్గవాసుల సంభాషణ!

ఆది, 02/18/2018 - 20:01

నరకవాసులతో స్వర్గవాసుల సంభాషణను మరియు నరకానికి దారితీసిన కారణాలను ఈ క్రింది వ్యాసంలో ప్రస్థావించడం జరిగింది.

నరకవాసులతో స్వర్గవాసుల సంభాషణ!

స్వర్గవనాలలో కూర్చుని సేదతీరుతున్న స్వర్గవాసులు నరకీయులతో ఈ విధంగా ప్రశ్నిస్తారు:
مَا سَلَكَكُمْ فِى سَقَرَ قَالُوا۟ لَمْ نَكُ مِنَ ٱلْمُصَلِّينَ وَلَمْ نَكُ نُطْعِمُ ٱلْمِسْكِينَ وَكُنَّا نَخُوضُ مَعَ ٱلْخَآئِضِينَ وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ ٱلدِّينِ حَتَّىٰٓ أَتَىٰنَا ٱلْيَقِينُ
''ఇంతకీ ఏ విషయం మిమ్మల్ని నరకానికి తీసుకువచ్చింది?'' (అని ప్రశ్నిస్తారు), వారిలా సమాధానమిస్తారు: ''మేము నమాజు చేసేవారము కాము, నిరుపేదలకు అన్నం పెట్టేవారమూ కాము, పైగా, మేము పిడివాదన చేసే వారితో (తిరస్కారులతో) చేరి, వాదోపవాదాలలో మునిగి ఉండేవారం.'' ''ప్రతిఫల దినాన్ని ధిక్కరించేవాళ్ళం.'' ''తుదకు మాకు మరణం వచ్చేసింది.''[అల్-ముద్దస్సిర్/42-47].
నరకానికి దారి చూపిన నాలుగు పనులు:
1. నమాజు చేయకపోవటం: మహప్రవక్త[స.అ.వ]ల వారు ఈ విధంగా ఉల్లేఖించారు:
من ترک الصلاۃ متعمدا من غیر علۃ فقد برء من ذمۃ اللہ و ذمۃ رسوله
"ఎవరైతే నమాజును ఇచ్చాపూర్వకంగా[తెలిసి కూడా] చేయరో వారు అల్లాహ్ మరియు అతని ప్రవక్త యొక్క శరణుకు దూరమవుతాడు".
వేరే చోట ఈ విధంగా సెలవిచ్చారు:
مَنْ تَرَكَ صَلَاةً لَا یَرْجُو ثَوَابَهَا وَ لَا یَخَافُ عِقَابَهَا فَلَا أُبَالِی أَ یَمُوتُ یَهُودِیّاً أَوْ نَصْرَانِیّاً أَوْ مَجُوسِیّا
"ఎవరైతే నమాజును దానిని చేయటం ద్వారా లభించే పుణ్యంపై విశ్వసించకుండా  మరియు దానిని తిరస్కరించడం వలన లభించే శిక్షకు భయపడకుండా దానిని తిరస్కరిస్తే అతను ఒక యూదుగా లేక క్రైస్తవునిగా లేక మజూసిగా[అగ్నిని పూజించే వానిగా] చనిపోయినా నాకు ఎటువంటి ఆశ్చర్యానికి గురి చేయదు".
2. నిరుపేదలకు సహయం చేయకపోవటం: వీరికి పేదల పట్ల ఎటువంటి దయ మరియు ప్రేమ కలగదు,దానికి గల కారణాన్ని ప్రస్థావిస్తూ దివ్యఖురాన్లో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:
ٱلشَّيْطَٰنُ يَعِدُكُمُ ٱلْفَقْرَ وَيَأْمُرُكُم بِٱلْفَحْشَآءِ ۖ وَٱللَّهُ يَعِدُكُم مَّغْفِرَةًۭ مِّنْهُ وَفَضْلًۭا ۗ وَٱللَّهُ وَٰسِعٌ عَلِيمٌۭ
“షైతాన్   మీకు   దారిద్య్రం   గురించి   భయపెడతాడు.   నీతిమాలిన   పనులకై   పురికొల్పుతాడు.   కాగా;   అల్లాహ్   మిమ్మల్ని   క్షమిస్తాననీ,   అనుగ్రహిస్తానని   వాగ్దానం   చేస్తున్నాడు.   అల్లాహ్   గొప్ప   ఉదార   స్వభావుడు,   అన్నీ   తెలిసినవాడు” [అల్-బఖర/268].
3. తిరస్కారులతో జత కట్టడం: తిరస్కారుల సాహచర్యం వీరిని అల్లహ్ కరుణకు దూరం చేస్తుంది,ఎల్లప్పుడు అల్లహ్ ఆయతులను తిరస్కరించడం మరియు పరిహాసించటం వారికి అలవాటుగా మారిపోయింది,కానీ దాని శిక్ష అల్లహ్ వద్ద చాల కఠినంగా ఉండనుంది,దాని గురించి దివ్యఖురాన్ లో అల్లహ్ తన ప్రవక్తతో ఈ విధంగా ఉల్లేఖించుచున్నాడు:
وَلَئِن سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ ۚ قُلْ أَبِٱللَّهِ وَءَايَٰتِهِ وَرَسُولِهِ كُنتُمْ تَسْتَهْزِءُونَ لَا تَعْتَذِرُوا۟ قَدْ كَفَرْتُم بَعْدَ إِيمَٰنِكُمْ ۚ إِن نَّعْفُ عَن طَآئِفَةٍۢ مِّنكُمْ نُعَذِّبْ طَآئِفَةًۢ بِأَنَّهُمْ كَانُوا۟ مُجْرِمِينَ
(మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి? అని) నువ్వు వారిని అడిగితే, ''అబ్బే ఏమీలేదు. ఏదో సరదాగా, నవ్వులాటకు ఇలా చెప్పుకుంటున్నాము'' అని వారంటారు. ''ఏమిటీ, మీరు అల్లాహ్‌తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తలతో పరిహాసమాడుతున్నారా?   అని   అడుగు, ''మీరింక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి ఒడిగట్టారు. ఒకవేళ మేము మీలో కొందరిని మన్నించినా, మరికొందరిని వారినేరాలకుగాను కఠినంగా శిక్షిస్తాము'' అని (ఓ   ప్రవక్తా!) వారికి చెప్పు.[అత్-తౌబ/65,66].
4. ప్రతిఫల దినాన్ని ధిక్కరించటం: ప్రతిఫల దినన్ని మరియు ఆ రోజున విధించబడే శిక్షను ప్రస్థవిస్తూ దివ్యఖురాన్ ఈ విధంగ సెలవిస్తుంది:
هَٰذِهِ جَهَنَّمُ ٱلَّتِى يُكَذِّبُ بِهَا ٱلْمُجْرِمُونَ٭يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ ءَانٍۢ٭
“నేరస్థులు అబద్ధమని కొట్టిపారేసిన నరకం ఇదే”, వారు దీనికీ (నరకానికీ) సలసలా కాగే నీళ్లకు మధ్య తచ్చాడుతూ ఉంటారు[అర్-రహ్మాన్/43,44].

రెఫరెన్స్:
ఉయూనొ అఖ్బారుర్ రెజా,1వ భాగం,పేజీ నం:285,బిహారుల్ అన్వార్,79వ భాగం,పేజీ నం:202.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 39