.అల్లాహ్ తరపు నుండి అవతరించబడిన ఆయత్ వివరణ ద్వార హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] గృహాన్ని మహోన్నతమైన గృహంగా నిర్ధారించారు కాని దైవప్రవక్త[స.అ] సహాబీయులలో కొందరు అదే గృహాన్ని తగలబెట్టేశారు.
హదీస్ రచయితల ఉల్లేఖానుసారం అల్లాహ్ తరపు నుండి ఈ ఆయత్ فی بُیُوت أَذِنَ اللّه أَنْ ترفعَ وَ یُذکَر فیها اسْمه; అనువాదం: “ఏ గృహాలను మహోన్నతం చేయటానికీ, ఏ గృహాలలో తన నామాన్ని స్మరించటానికీ అల్లాహ్ అనుమతించాడో, ఈ గృహాలలో ఉంటారు”[నూర్,36]. దైవప్రవక్త[స.అ] పై అవతరించినపుడు, దైవప్రవక్త[స.అ] ఈ ఆయత్ ను మస్జిదులో పఠించారు, అప్పుడు ఒక వ్యక్తి నిలబడి ఇలా అన్నాడు: “ఓ గౌరవనీయులైన ప్రవక్త[స.అ] ఇంత ప్రాముఖ్యత కలిగి ఉన్న గృహాలకు అర్ధమేమిటి?”, దైవప్రవక్త[స.అ] ఇలా అన్నారు: “ప్రవక్తల గృహములు” అప్పుడు అబూబక్ర్ నిలబడి హజ్రత్ అలీ[అ.స] మరియు ఫాతెమా జహ్రా[స.అ]ల గృహము వైపు చూపుతూ ఇలా అన్నారు: “ఈ గృహం, ఆ గృహముల నుండేనా!?, దైవప్రవక్త[స.అ] ఇలా బదులిచ్చారు: “ఔను! ఇది అందుకు అత్యంత అర్హత గల గృహము”[దుర్రుల్ మన్సూర్, భాగం6, పేజీ203].
అంతే కాకుండా దైవప్రవక్త[స.అ] 9 నెలలు తమ కుమార్తె ఇంటికి వచ్చి ఆమె మరియు ఆమె భర్తకు సలాములు తెలియపరిచి ఈ ఆయత్ ను పఠించేవారు: إِنَّما یُرید اللّه لیذهبَ عَنْکُمُ الرِّجْس أَهل البَیت و یُطهّرکُمْ تَطهیراً [దుర్రుల్ మన్సూర్, భాగం6, పేజీ606].
హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] గృహం అల్లాహ్ కాంతికి కేంద్రం. అల్లాహ్ ఆ గృహాన్ని మహోన్నతం చేయటానికి ఆదేశించాడు. ఇలాంటి గృహం చాలా గొప్ప గృహం. ఈ విధంగా చూస్తే ఈ గృహాన్ని సహాబీయులు మరియు ముస్లిములు గౌరవించాలి. దాని ప్రతిష్టతను కాపాడాలి. కాని మేము ఇస్లామీయ చరిత్రను చదివిన్నప్పుడు ఒక విషాధ సంఘన; దైవప్రవక్త[స.అ] మరణాంతరం సహాబీయులలో కొందరు అదే గృహాన్ని తగలబెట్టడానికి నిప్పును తీసుకొని వచ్చి, ఆమెను బెదిరించి, ఆ గృహాన్ని నిప్పంటించారు, అని చూస్తాము. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆలోచించండి.
రిఫ్రెన్స్
దుర్రుల్ మన్సూర్, భాగం6, పేజీ203 మరియు 606.
వ్యాఖ్యలు
Mashaallah ...Jazaakallah
Shukriya Himmat afzaei ka ....
Mashaallah ...Jazaakallah
Shukriya.
Mashaallah ...Jazaakallah
Shukriya...
వ్యాఖ్యానించండి