షిర్క్ దివ్యఖురాన్ ద్రుష్టిలో

సోమ, 03/05/2018 - 19:06

సర్వలోకేశ్వరుడైన ఆ అల్లాహ్ ను వదిలి మనలాంటివైన స్రుష్టితాలను ఆరాధించటం మహా పాపం, ఇలా చేస్తే మన హక్కులో మనమే అన్యాయం చేసుకున్న వాళ్ళమవుతాము. 

షిర్క్ [బహుదైవారాధన] దివ్యఖురాన్ ద్రుష్టిలో

సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ మనిషికి ఎన్నొ భాగ్యాలు ప్రసాదించాడు,అడగకుండానే అతని కోరికలు తీరుస్తున్నాడు,ఒక వేళ మనిషి తనను ఆరాధ్యునిగా భావించకుండా వేరే సృష్టితాలను పూజిస్తున్నా వారిపై తన కృపను మరియు దయను ఆపలేదు,కానీ మనిషి ఆ దేవుని ఆజ్ఞలను శిరసావహించకుండా ఇతర సృష్టితాలే తనకు అండగా ఉన్నాయని భావించి వాటిని పూజిస్తున్నాడు,అసలు ఇస్లాంలో మరియు ఖురాన్ దృష్టిలో బహుదైవారాధన అంటే ఎమిటి అనే ప్రశ్నకు జవాబు ఖురాన్లో సంక్షిప్తంగా వివరించటం జరిగింది.
ఖురాన్ దృష్టిలో షిర్క్[బహుదైవారాధన] రకములు:
1. విగ్రహారాధన: విగ్రహారాధన ఇస్లాం ద్రుష్టిలో మహాపాపం,హజ్రత్ ఇబ్రాహీం[అ.స] తన తండ్రితో విధంగా సంభొదిస్తునారు:
إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِۦ مَا هَٰذِهِ ٱلتَّمَاثِيلُ ٱلَّتِىٓ أَنتُمْ لَهَا عَٰكِفُونَ٭قَالُوا۟ وَجَدْنَآ ءَابَآءَنَا لَهَا عَٰبِدِينَ٭قَالَ لَقَدْ كُنتُمْ أَنتُمْ وَءَابَآؤُكُمْ فِى ضَلَٰلٍۢ مُّبِينٍۢ
అతను తన తండ్రితో, తన జాతి వారితో, "ఇంతకీ మీరు ఇంతటి శ్రద్ధాభక్తులతో పూజిస్తూ కూర్చున్న ఈ విగ్రహాల సంగతేమిటీ?" అని అడిగినప్పుడు, మా తాతముత్తాతలు వీటిని పూజిస్తూ ఉండగా మేము చూసి ఉన్నాము అని వారంతా సమాధానమిచ్చారు, అలాగయితే మీరూ, మీ తాత ముత్తాతలంతా స్పష్టమైన అపమార్గానికి లోనై ఉన్నారు అని అతను అన్నాడు.[అల్-అంబియ:52,53,54].
2. తోటి మానవమాత్రులను ఆరాధించటం: ఆ అల్లాహ్ ను వదిలి మనలాంటి స్రుష్టితాలైన   బాబాలను,సన్యాసులను వేడుకోవడం వాళ్ళకు ఆ స్రుష్టికర్త కన్న ఎక్కువ విలువను ఇవ్వటం కూడా ఇస్లాంలొ ద్రుష్టిలో మహాపాపం.
దైవ ఖురాన్ లో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:
ٱتَّخَذُوٓا۟ أَحْبَارَهُمْ وَرُهْبَٰنَهُمْ أَرْبَابًۭا مِّن دُونِ ٱللَّهِ وَٱلْمَسِيحَ ٱبْنَ مَرْيَمَ وَمَآ أُمِرُوٓا۟ إِلَّا لِيَعْبُدُوٓا۟ إِلَٰهًۭا وَٰحِدًۭا ۖ لَّآ إِلَٰهَ إِلَّا هُوَ ۚ سُبْحَٰنَهُۥ عَمَّا يُشْرِكُونَ
వారు అల్లాహ్‌ను వదలి తమ పండితుల (అహ్‌బార్‌)ను, సన్యాసుల(రుహ్‌బాన్‌)ను తమ ప్రభువులుగా చేసుకున్నారు - మర్యమ్‌ కుమారుడైన మసీహ్‌ను కూడా. నిజానికి వారికి, ఒక్కడైన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించవలసిందిగా ఆజ్ఞాపించబడింది. ఆయన   తప్ప మరో ఆరాధ్యదైవం లేడు. వారు నిర్థారించుకుంటున్న భాగస్వామ్యాలకు ఆయన అతీతుడు, పవిత్రుడు[అత్-తౌబా/31].
3. మనొవాంఛలను ఆరాధించటం: తన మనోవాంఛనలను ఆరాధ్యదైవంగా చేసుకోవటం కూడా ఇస్లాం ద్రుష్టిలో బహుదైవారాధనే,దివ్య ఖురాన్ లో దీని గురించి అల్లహ్ తన ప్రవక్తతో సంభోదిస్తూ ఈ విధంగా సెలవిస్తున్నాడు:
أَفَرَءَيْتَ مَنِ ٱتَّخَذَ إِلَٰهَهُۥ هَوَىٰهُ وَأَضَلَّهُ ٱللَّهُ عَلَىٰ عِلْمٍۢ وَخَتَمَ عَلَىٰ سَمْعِهِۦ وَقَلْبِهِۦ وَجَعَلَ عَلَىٰ بَصَرِهِۦ غِشَٰوَةًۭ فَمَن يَهْدِيهِ مِنۢ بَعْدِ ٱللَّهِ ۚ أَفَلَا تَذَكَّرُونَ
తన మనోవాంఛను ఆరాధ్యదైవంగా చేసుకున్న వాడ్ని నువ్వు చూశావా? అంతా తెలిసినప్పటికీ - అల్లాహ్‌ అతన్ని అప మార్గానికి లోను చేశాడు. అతని చెవులకూ, అతని హృదయా నికి సీలు వేశాడు. అతని కళ్లపై కూడా తెరను వేసేశాడు. ఇప్పుడలాంటి వ్యక్తిని - అల్లాహ్‌ తర్వాత - సన్మార్గానికి తెచ్చే వాడెవడుంటాడు? ఏమిటి, ఇప్పటికీ మీరు విషయాన్ని గ్రహించరా?[అల్-జాసియ/23].
ఇస్లాం భొదనలను తిరస్కరించి వేరే సృష్టితాలను ఆరాధించటం మహా పాపం,మానవుని అన్ని పాపాలను అల్లాహ్ క్షమిస్తాడు కానీ ఈ బహుదైవరాధనని ఆ అల్లాహ్ ఎప్పటికి క్షమించడు: 

إِنَّ ٱللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِۦ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَآءُ ۚ
తనకు భాగస్వామ్యం (షిర్క్) కల్పించటాన్ని అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. షిర్క్ మినహా తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు.[అన్-నిసా/ 116].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19