హాఖ్ఖహ్ సూరహ్

ఆది, 03/11/2018 - 06:36

పవిత్ర ఖుర్ఆన్ యొక్క 69వ సూరహ్ అయిన “హాఖ్ఖహ్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

హాఖ్ఖహ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 69వ సూరహ్ ఇది. “హాఖ్ఖహ్” అనగ యదార్థం, వాస్తవం, నిశ్చితం అంటే ప్రళయం అని అర్ధం. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి మూడు ఆయత్లు. ఈ సూరహ్ లో “హాఖ్ఖహ్” అను పదం 3 సార్లు మరియు పూర్తి ఖుర్ఆన్ లో 3 సార్లు వచ్చింది. ఈ సూరహ్ లో 52 ఆయత్‍లు, 260 పదాలు మరియు 1133 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 1 సారి వచ్చింది. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “ముల్క్” సూరహ్ మరియు దీని తరువాత “మఆరిజ్” సూరహ్ అవతరించబడ్డాయి. “హాఖ్ఖహ్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ “హాఖ్ఖహ్” అను పదంతో మొదలు అవ్వడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] ఇలా ప్రవచించెను “ఎక్కువగా “హాఖ్ఖహ్” సూరహ్ ను నమాజులలో పఠిస్తూ ఉండండి. ఇలా చేయడం అల్లాహ్ మరియు దైవప్రవక్త[స.అ] పై విశ్వాసం ఉంచినట్లు. దీనిని పఠించే వాడు అల్లాహ్ వద్దకు చేరనంత వరకు దీన్ నుండి దూరం అవ్వడు”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ102].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ102.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15