ఇస్లాంలో బంధుత్వ సంబంధాల ప్రాముఖ్యత

బుధ, 03/14/2018 - 20:19

మానవుడు అందరితో సోదరభావం మరియు ప్రేమతో జీవించాలనేదే ఇస్లాం ఆశయం. 

ఇస్లాంలో బంధుత్వ సంబంధాల ప్రాముఖ్యత

మానవుని బాంధవ్యాలకు,వారి చుట్టరికాలకు వారి మధ్య గల సంబంధాలకు ఎటువంటి ధర్మం కూడా వ్యతిరేకం కాదు అలాగే ఇస్లాం కూడా వారి మధ్య మంచితనంతో మరియు ప్రేమానురాగాలతో మెలగాలని ఆదేసిస్తుంది,ఒక వేళ అలా చేయక పోతే ఆ అల్లాహ్  కోపానికి మరియు అప్రసన్నతకు అర్హులవుతారని హెచ్చరిస్తుంది.
అందరితో ప్రేమగా మెలగండి:
وَٱعْبُدُوا۟ ٱللَّهَ وَلَا تُشْرِكُوا۟ بِهِۦ شَيْـًۭٔا ۖ وَبِٱلْوَٰلِدَيْنِ إِحْسَٰنًۭا وَبِذِى ٱلْقُرْبَىٰ وَٱلْيَتَٰمَىٰ وَٱلْمَسَٰكِينِ وَٱلْجَارِ ذِى ٱلْقُرْبَىٰ وَٱلْجَارِ ٱلْجُنُبِ وَٱلصَّاحِبِ بِٱلْجَنۢبِ وَٱبْنِ ٱلسَّبِيلِ وَمَا مَلَكَتْ أَيْمَٰنُكُمْ ۗ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ مَن كَانَ مُخْتَالًۭا فَخُورًا
అల్లాహ్ ను ఆరాధించండి. ఆయనకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి. బంధువుల పట్ల, తండ్రిలేని బిడ్డల పట్ల, నిరుపేదల పట్ల, ఆత్మీయులైన పొరుగువారి పట్ల, బంధువులు కాని పొరుగువారి పట్ల, ప్రక్కనున్న మిత్రుల పట్ల, బాటసారుల పట్ల, మీ అధీనంలో ఉన్న బానిసల పట్ల ఔదార్యంతో మెలగండి. నిశ్చయంగా అల్లాహ్ అహంకారంతో విర్రవీగేవారిని, బడాయి కొట్టే వారిని ఎంతమాత్రం ఇష్టపడడు[అన్-నిసా/36].
తెగత్రెంపులకు దూరంగా ఉండండి:
وَٱتَّقُوا۟ ٱللَّهَ ٱلَّذِى تَسَآءَلُونَ بِهِۦ وَٱلْأَرْحَامَ ۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًۭا
"ఎవరిపేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహ్ కు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగత్రెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మీపై నిఘావేసి ఉన్నాడు" [అన్-నిసా/1].
ఇమాం అలి[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు:
اِذا قَطَّعُوا الرحامَ جُعِلَتِ الموالُ فى أيدىِ الشرارِ؛
అనువాదం:“ఎవరైతే తమ బంధువులతో తెగత్రెంపులు చేసుకుంటారో వారి సంపదలు ఇతర చెడ్డవాళ్ళ చేతికి చేరుతాయి”[తమవాళ్ళపై ఖర్చు చేయనందు వలన].
ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు:
صِلَةُ الرَّحِمِ تَعمُرُ الدِّيارَ وَ تَزيدُ فى الأعمارِ وَ اِن كانَ اَهلُها غَيرَ اَخيارٍ
అనువాదం: “బంధుత్వాలు మీ గ్రుహాలను సుసంపన్నం చేస్తాయి మరియు మీ ఆయష్షును పెంచుతాయి ఒక వేళ వారు[ఎవరితో ఐతే బాంధవ్యాన్ని ఎర్పరుచుకున్నారో] మంచి వారు కాక పోయినా సరే”.
ఇమాం సాదిఖ్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు:
صِلُوا أرحامَكُم و بِرّوا بِإخوانِكُم وَ لَو بِحُسنِ السَّلامِ وَ رَدِّ الجَوابِ
అనువాదం: "బంధుత్వాలను ఏర్పరుచుకొండి మరియు ఇతర ముస్లిం సోదరులతో మంచితనంతో మెలగండి,ఒక వేళ అది మంచి శైలిలో సలాం చేయటం ద్వారా లేదా [ఇతరుల] సలాంకు జవాబుగా అయినా సరే".

రెఫరెన్స్
అల్-కాఫి, 2వ భాగం, పేజీ:157,348, ఆమాలియె తూసి, పేజీ నం:481.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by ఎం.కే.అబ్బాస్ on

మన కుటుంబంలోని ప్రతీవారు ఆచరిస్తే చాలా మంచిదని నా మనవి! లోకంలో మనం ఎవరినీ కష్టపెట్టి సాధించేది లేదు. మనం పరలోకానికి పోయినా మన గురించే అందరుా తలచుకుంటుా ఉండాలి.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12