ఖురాన్ తో ఇమాం అలి[అ.స] ల వారి విడదీయలేని బంధం

ఆది, 04/01/2018 - 18:38

మహాప్రవక్త[స.అ.వ] ల వారి ప్రవచనానుసారం ఇమాం అలి[అ.స] మరియు ఖురాన్ ల బంధం విడదీయరానిది.

ఖురాన్ తో ఇమాం అలి[అ.స] ల వారి విడదీయలేని బంధం

మహాప్రవక్త[స.అ.వ] ల వారు ఈ లోకన్ని విడిచిన తరువాత ఖురాన్ సేకరణ మరియు దాని సంకలనానికి తలపెట్టిన మొదటి వ్యక్తి ఇమాం అలి[అ.స] ల వారు, దీనిపై అహ్లె సున్నత్ యొక్క ఉలమాలు వివరణ ఇస్తూ నాలుగు వ్యక్తులు ఈ పనిని పూర్తి చేసారని చెబుతారు,కానీ చివరికి వారు కూడా ఆ నలుగురిలో మొదటి వ్యక్తి ఇమాం అలి[అ.స] ల వారు అనే విశ్వసిస్తారు.హదీసులలో మరియు అహ్లె సున్నత్ యొక్క పుస్తకాలలో దీనికి సాక్ష్యాలు కూడా లభిస్తాయి.
మహాప్రవక్త[స.అ.వ]ల వారు ఎన్నొ సార్లు తన హదీసులో ఖురాన్ మరియు ఇమాం అలి[అ.స]ల వారి విడదీయ లేని బంధం గురించి వివరించారు,ఉమ్మె సల్మా మహప్రవక్త[స.అ.వ]ల వారి ఉల్లెఖనను వివరిస్తూ ఈ విధంగా పలికారు:"అలి[అ.స] ఖురాన్ తో మరియు ఖురాన్ అలి[అ.స] తో ఉన్నది,వీరిద్దరు కౌసర్ కొలను వద్ద నన్ను కలిసే వరకు ఒకరితో మరొకరు వేరు కాలేరు ".
మహనీయ ప్రవక్త[స.అ.వ]ల వారి ఈ ఉపదేసం కొన్ని విషయాలను మనకు వర్ణిస్తుంది:
1. మహాప్రవక్త[స.అ.వ]ల వారి తరువాత ఖురాన్ మరియు దాని వాస్తవాలను కేవలం ఇమాం అలి[అ.స]ల వారే వివరించగలరు,ఎందువలననగా ఒక హదీసులో వారు ఈ విధంగా ఉల్లేఖించి ఉన్నారు: “ఏ ఒక్క ఆయతు కూడా ప్రవక్తల వారిపై అవతరింపబడలేదు కానీ వారు దానిని నాకు చదివి వినిపించేవారు మరియు దాని వివరణ,వ్యాఖ్యానాలు మొదలైన వాటిని  నాకు వివరించే వారు”.
2. ఇమాం అలి[అ.స] ఖురాన్ యొక్క రక్షకులు: మహాప్రవక్త[స.అ.వ] ల వారు ఖురాన్ ను సం రక్షించమని,యాదుల మాదిరిగా ఖురాన్లో వక్రీకరణ జరగకుండా దానిని కాపాడాలని ఆజ్ఞాపించినప్పుడు ఇమాం అలి[అ.స]ల వారు ఖురాన్ సం రక్షణకు చేసిన కృషి అన్ని గ్రంధాలలో ప్రస్థావనకు వచ్చింది,ఆ సందర్భములో ఇమాం అలి[అ.స]ల వారు ఈ విధంగా పలికారు: “నేను ఈ ఖురాన్ సేకరణ పూర్తి కానంత వరకు నా భుజంపై రిదాను [అరబ్బులు తమ బట్టల పై ధరించే ఒక వస్త్రం] ధరించను”.
3. అన్ని వాస్తవాలు ఖురాన్లో పొందుపరచబడ్డాయి,వాటిని సంక్షిప్తముగా వివరించగల వ్యక్తి ఇమాం అలి[అ.స] ఒక్కరే: “ఇబ్నె షబ్రమా ఈ విధంగా పలికెను: ఒక్క అలి ఇబ్నె అబీ తాలిబ్[అ.స]ల వారు తప్ప ఏ ఒక్కరు ఖురాన్ గురించి ప్రశ్నించమని అడగలేదు”.

రెఫరెన్స్
అహ్ఖాఖుల్ హఖ్, 5వ భాగం, పేజీ నం:639, షవాహెదుత్ తంజీల్, 1వ భాగం, పేజీ నం:42, తారీఖె ఖురానె కరీం, సయ్యిద్ మొహమ్మద్ బాఖిర్ హుజ్జత్, పేజీ నం:388.

  

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17