జనాబె జైనబ్[స.అ]

సోమ, 04/02/2018 - 13:21

హజ్రత్ అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్[స.అ] యొక్క ప్రియకుమార్తె అయిన జనాబె జైనబ్[స.అ] గురించి సంక్షిప్త వివరణ. 

జనాబె జైనబ్[స.అ]

అరబీ భాషలో “జైనబ్” యొక్క అర్ధం మంచిదృశ్యంగల వృక్షం. అనగా మంచి మంచి సువాసనలతో, రసభరితమైన పండ్లూ, పూలతో నిండుగా ఉన్న వృక్షం, దానిని చూడగానే మనసుకు శాంతి కలుగుతుంది మరియు అది ప్రతీ మనిషికి లాభం చేకూర్చుతుంది. “జైనబ్” యొక్క పదానికి ఇంకో అర్ధం కూడా ఉంది అది “జైను అబ్” అనగా “తండ్రికి అలంకరణ”. ఈమె హజ్రత్ అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్[స.అ] యొక్క ప్రియకుమార్తె. ఖుర్ఆన్, అహ్లెబైత్[అ.స]ను “షజరయే తయ్యబహ్” అనగా పవిత్రమైన వృక్షంగా వివరించింది, మరి జనాబె జైనబ్[అ.స] ఆ “షజరయే తయ్యబహ్” యొక్క మంచిదృశ్యం గల వృక్షంలాంటివారు దాని సుగంధంతో విశ్వాసులూ, ధర్మనిష్టులూ ప్రభావితులయ్యారు. ఈ వృక్షం యొక్క ప్రతిష్టత యొక్క ప్రకాశవంతమైనా, పచ్చనైనా ఆకులను అల్లాహ్ తయారు చేశాడు, అందులో గొప్ప గుణాలు, మాట సరళత్వం, మంచి స్వభావం, స్వచ్ఛమైన తౌహీద్, జ్ఞానం, కరుణా, జాలీ, దయా, ధర్మనిష్ఠత, ధైర్యసాహసాలు, శౌర్యం, ఉత్తమత్వం, పవిత్రిత, గొప్పతనం, సౌఖ్యం మరియు గౌరవం యొక్క సుగంధాలు ఉన్నాయి. మరి అందులో ఉన్న ఆకర్షణ చూసే వారికి ముగ్దుడ్ని చేస్తాయి.[జిందగానియే సిద్దిఖయే కుబ్రా వ హజ్రత్ జైనబ్[స.అ], పేజీ10,11]

రిఫ్రెన్స్
సయ్యద్ హాషిమ్ దస్తెఖైబ్, జిందగానియే సిద్దిఖయే కుబ్రా వ హజ్రత్ జైనబ్(స.అ), పేజీ10,11.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 36