ఇన్ఫితార్ సూరహ్

సోమ, 04/09/2018 - 15:28

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 82వ సూరహ్ అయిన “ఇన్ఫితార్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఇన్ఫితార్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 82వ సూరహ్ ఇది. “ఇన్ఫితార్” అనగ బ్రద్దలవ్వడం. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “ఇన్ఫితార్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 20 సార్లు(ఫతర, యఫత్తర్నా, ఇన్ఫతరత్, ఫాతిర్, ఫతరహ్, ఫుతూర్, మన్ఫతర్ మొ.. పదాల రూపంలో) వచ్చింది. ఈ సూరహ్ లో 19 ఆయత్‍లు, 81 పదాలు మరియు 333 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి వచ్చింది. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “నాజిఆత్” సూరహ్ మరియు దీని తరువాత “ఇన్షిఖాఖ్” సూరహ్ అవతరించబడ్డాయి. “ఇన్ఫితార్” సూరహ్ ను “ఇన్ ఫతరత్” అని కూడా అంటారు. “ఇన్ఫితార్” సూరహ్ నామకరణానికి కారణం “ఇన్ ఫతరత్” పదం “ఇన్ఫితార్” పదం నుండి తీసుకోబడడం. ఈ సూరహ్ యొక్క ప్రత్యేకతలు: 1. ఇప్పడు ఉన్న క్రమం మరియు అవతరించబడ్డ క్రమం ఒకటే. 2. కేవలం ఈ సూరహ్ మాత్రమే “అల్లాహ్” పదంతో ముగిసింది. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు “ఏ వ్యక్తి అయితే “ఇన్ఫితార్” సూరహ్ ను పఠిస్తాడో అల్లాహ్ అతడికి ప్రతీ సమాధి చొప్పున ఒక పుణ్యం ప్రసాదిస్తాడు. మరియు ప్రతీ నీటి బిందువు చొప్పున పదింతలు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు మరియు ప్రళయం నాడు అతడికి ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది”.[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ283].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ283.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16