అబస సూరహ్

ఆది, 04/08/2018 - 10:27

పవిత్ర ఖుర్ఆన్ యొక్క 80వ సూరహ్ అయిన “అబస” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

అబస సూరహ్

ఖుర్ఆన్ యొక్క 80వ సూరహ్ ఇది. “అబస” అనగ విసుగుగొనుట, ముఖమును చిట్లించుకోవడము, అప్రసన్నత మొదలగు అర్ధాలు. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో“అబస” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 2 సార్లు(“అబస” సూరహ్ మొదటి ఆయత్ లో మరియు “ముద్దస్సిర్” సూరహ్ 22 ఆయత్ లో) వచ్చింది. ఈ సూరహ్ లో 42 ఆయత్‍లు, 133 పదాలు మరియు 553 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి రాలేదు. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “నజ్మ్” సూరహ్ మరియు దీని తరువాత “ఖద్ర్” సూరహ్ అవతరించబడ్డాయి. “అబస” సూరహ్ ను “అఅమా” మరియు “సఫరహ్” అని కూడా అంటారు. “అబస” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ “అబస” అన్న పదంతో మొదలు అవ్వడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించారు “అబస సూరహ్ మరియు తక్వీర్ సూరహ్ లను పఠించిన వ్యక్తి అల్లాహ్ సైన్యం నుండి అవుతాడు. అల్లాహ్ కారుణ్యం మరియు ఆయన నీడ అతడు పొందుతాడు”.[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ263].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ263.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16