బలద్ సూరహ్

ఆది, 04/15/2018 - 15:04

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 90వ సూరహ్ అయిన “బలద్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ. 

బలద్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 90వ సూరహ్ ఇది. “బలద్” అనగ పట్టణం, నగరం. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “ఫజ్ర్” అను పదం 2 సార్లు మరియు పూర్తి ఖుర్ఆన్ లో 19 సార్లు(“బలద్” అని 8 సార్లు, “బలదన్” అని 1 సారి, “అల్ బిలాద్” అని 5 సార్లు మరియు “బుల్దహ్” అని 5 సార్లు) వచ్చింది. ఈ సూరహ్ లో 20 ఆయత్‍లు, 82 పదాలు మరియు 342 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి కూడా రాలేదు. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “ఖాఫ్” సూరహ్ మరియు దీని తరువాత “తారిఖ్” సూరహ్ అవతరించబడ్డాయి. “బలద్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ మొదటి ఆయత్ లో “బలద్” అన్న పద్దం ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే తన వాజిబ్ నమాజులలో “బలద్” సూరహ్ ను పఠిస్తాడో అతడు ఈ లోకంలో మంచివ్యక్తిగా ప్రఖ్యాతి చెందుతాడు మరియు పరలోకంలో అల్లాహ్ సన్నిహితుడిగా లేపబడతాడు మరియు దైవప్రవక్తల, అల్లాహ్ మార్గంలో మరణించినవారి మరియు సజ్జనుల మిత్రుడిగా లెక్కించబడతాడు”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ357].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ357.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16