లైల్ సూరహ్

సోమ, 04/16/2018 - 17:05

పవిత్ర ఖుర్ఆన్ యొక్క 92వ సూరహ్ అయిన “లైల్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

లైల్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 92వ సూరహ్ ఇది. “లైల్” అనగ రాత్రి. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “లైల్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 92 సార్లు(“అల్ లైల్” అని 74 సార్లు, “లైలన్” అని 5 సార్లు, “లైలహ్” అని 8 సార్లు, “లైలుహా” అని 1 సారి, “లయాలిన్” అని 3 సార్లు మరియు “లయాలీ” అని 1 సారి) వచ్చింది. ఈ సూరహ్ లో 21 ఆయత్‍లు, 71 పదాలు మరియు 316 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి కూడా రాలేదు. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “అఅలా” సూరహ్ మరియు దీని తరువాత “ఫజ్ర్” సూరహ్ అవతరించబడ్డాయి. “లైల్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ “లైల్” అన్న పద్దంతో మొదలవ్వడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించెను “ఎవరైతే “లైల్” సూరహ్ ను పఠిస్తాడో అల్లాహ్ అతడికి అతడు రాజీపడేంత ప్రసాదిస్తాడు, కష్టాల నుండి కాపాడుతాడు, అతడి జీవితం సుఖంగా కడుస్తుంది”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ373].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ373.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 41