.ఖుర్ఆన్ యొక్క ఆరవ సూరహ్ అయిన అన్ఆమ్ గురించి సంక్షిప్తంగా.
ఖుర్ఆన్ యొక్క ఆరవ సూరా ఇది. అన్ఆమ్ అనగ చతుష్పత్తు(నాలుగు కాళ్ళ జంతువులు). ఈ సురాకు సంబంధించిన ఆయత్ ఈ సూరాకు చెందిన 136 వ ఆయత్. ఈ సూరాలో అన్ఆమ్ అను పదం 6 సార్లు మరియు పూర్తి ఖుర్ఆన్ లో 32 సార్లు వచ్చింది. ఈ సూరాలో 165 ఆయత్ లు, 3055 పదాలు మరియు 12727 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో అల్లాహ్ పదం 87 సార్లు వచ్చింది. ఈ సూరా మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు హిజ్ ర్ సూరా మరియు దీని తరువాత సాఫ్పాత్ సూరా అవతరించబడ్డాయి. దీని పేరు అన్ఆమ్ అని పెట్టడానికి కారణం అందులో మిగిలిన సూరాల కన్న ఎక్కవగా అన్ఆమ్ పదం వచ్చింది మరియు ఇందులోనే వాటి అహ్కాముల వివరణ ఉంది. స్త్రీలకు సంబంధించిన అహ్కాముల వివరణ. ఇబ్నె అబ్బాస్ ఉల్లేఖన ప్రకారం ఎవరైతే నిరంతరం అన్ఆమ్ సూరాను పఠిస్తూ ఉంటారో వారు ప్రళయం నాడు సురక్షితంగా ఉంటారు.
వ్యాఖ్యానించండి