బహ్లూల్ ధర్మ సంరక్షణ

సోమ, 04/16/2018 - 17:37

ఇమాం కాజిం[అ.స] అనుచరులలో ఒకరైన బహ్లూల్ అబ్బాసీ ఖలీఫాలతో చాలా చాకచక్యంగా ప్రవర్తించి తనను మరియు ఇమాం[అ.స]ల వారి అనుచరులను ఆ ఖలీఫాల బారి నుండి రక్షించేవారు. 

బహ్లూల్ ధర్మ సంరక్షణ

అబ్బాసీ ఖలీఫాలలో ఒకడైన హరూన్ రషీద్ తన రాజ్యానికి ఒక ధర్మాధికారిని నియమించాలని అనుకున్నాడు, తన దర్బారులో ఉన్నవారితో ఈ విషయంపై చర్చించి ఈ పనికి బహ్లూల్ ఒక్కడే అర్హుడని తెలుసుకున్నాడు, ఆ తరువాత బహ్లూల్ ముందు ఈ విషయన్ని ప్రస్థావించాడు, కానీ బహ్లూల్ తను దానికి సమర్ధవంతుడు కానని చెప్పారు, అది విన్న హారూన్ అందరు నీవే ఈ పదవికి అర్హుడవు అని చెబుతున్నారు మరి నువ్వు మాత్రం కాదంటున్నావు? అని ప్రశ్నించాడు, దానికి జవాబుగా నా గురించి నాకు ఎక్కువగా తెలుస్తుందా లేదా ప్రజలకి తెలుస్తుందా? అని ప్రశ్నించాడు.  
నువ్వు ఎలాగైనా ఈ పదవిని స్వీకరించాలి అని హరూన్, బహ్లూల్ ను బలవంతం చేయసాగాడు, దానికి బహ్లూల్ నాకు ఆలోచించుకోవడానికి ఒక రాత్రి సమయం కావాలి అన్నారు, దానికి హరూన్ సరేనన్నాడు.
మరుసటి ఉదయం బహ్లూల్ బజారులో ఒక చెక్కపై స్వారీ చేస్తూ తప్పుకొండి తప్పుకొండి నా గుర్రానికి దారివ్వండి అని అరవసాగారు, అది చూసిన ప్రజలు బహ్లూల్ పిచ్చివాడయిపోయారని ఈ సమాచారాన్ని హారూన్ కు చేరవేసారు, అది విన్న హరూన్  “బహ్లూల్ పిచ్చివాడయిపోలేదు ఇలా చేయడం ద్వారా మానుంచి తప్పించుకొని తన ధర్మాన్ని రక్షించుకున్నాడు మరియు ప్రజల హక్కులో జోక్యం చెసుకోదలచుకోలేదు” అని పలికాడు.
దేవుడు వివిధ రకాలుగా తన దాసులను పరీక్షిస్తాడు, బహ్లూల్ ను ఈ విధంగా పరీక్షించటం జరిగింది, దానిలో బహ్లూల్ ఉత్తీర్నులై తన ధర్మాన్ని కాపాడుకున్నారు.

రెఫరన్స్
ఎక్ సద్ మౌజూ పాన్సద్ దాస్తాన్.       

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 29