అలఖ్ సూరహ్

బుధ, 04/25/2018 - 15:23

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 96వ సూరహ్ అయిన “అలఖ్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

అలఖ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 96వ సూరహ్ ఇది. “అలఖ్” అనగ రక్తం, నెత్తుడి ముద్ద. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి రెండు ఆయత్లు. ఈ సూరహ్ లో “అలఖ్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 7 సార్లు(“అలఖ్” అని 1 సారి, “అలఖహ్” అని 1 సారి మరియు “ముఅల్లఖహ్” అని 1 సారి) వచ్చింది. ఈ సూరహ్ లో 19 ఆయత్‍లు, 72 పదాలు మరియు 288 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒకసారి వచ్చింది. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు ఏ సూరహ్ అవతరించలేదు ఎందుకంటే ఇదే అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ మొట్టమొదటి సూరహ్ కాబట్టి. దీని తరువాత “ఖలమ్” సూరహ్ అవతరించబడింది. “అలఖ్” సూరహ్ ను “ఇఖ్రా” మరియు “ఇఖ్రా బిస్మి రబ్బిక్” అని కూడా అంటారు. “అలఖ్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ యొక్క రెండవ ఆయత్ లో “అలఖ్” అన్న పద్దం ఉండడం. ఈ సూరహ్ ప్రత్యేకతలు.. 1. దైవవాణి ఈ సూరహ్ నుండే అవతరించడం మొదలయ్యింది. 2. చివరి వాజిబ్ సజ్దహ్ ఈ సూరహ్ లోనే ఉంది. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించారు “అలఖ్” సూరహ్ పఠించిన వాడి మరణం, (అల్లాహ్ మార్గంలో మరణించిన) వీరుల మరణం మాదిరి, ఆ వీరుల మాదిరే లెపబడతాడు, అదే విధంగా జీవిస్తాడు, అల్లాహ్ మార్గంలో దైవప్రవక్త[స.అ] తో కలిసి యుద్ధం చేసిన పుణ్యానికి అర్హుడవుతాడు”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ396].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ396.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18