ఖారిఅహ్ సూరహ్

శుక్ర, 05/11/2018 - 18:01

పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ యొక్క 101వ సూరహ్ అయిన “ఖారిఅహ్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఖారిఅహ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 101వ సూరహ్ ఇది. “ఖారిఅహ్” అనగా గడగడలాడించేది అనగా అంతిమదినం. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “ఖారిఅహ్” అను పదం 3 సార్లు మరియు పూర్తి ఖుర్ఆన్ లో 5 సార్లు(“ఖారిఅహ్” సూరహ్ 3 సార్లు, “రఅద్” సూరహ్ లో 1 సారి మరియు “హాఖహ్” సూరహ్ లో 1 సారి) వచ్చింది. ఈ సూరహ్ లో 11 ఆయత్‍లు, 36 పదాలు మరియు 160 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి కూడా రాలేదు. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “ఖురైష్” సూరహ్ మరియు దీని తరువాత “ఖియామహ్” సూరహ్ అవతరించబడ్డాయి. “ఖారిఅహ్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ “ఖారిఅహ్” అన్న పద్దంతో మొదలవ్వడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] ఇలా ప్రవచించెను ““ఖారిఅహ్” సూరహ్ ను పఠించేవాడు దజ్జాల్ అరాచకం నుండి సురక్షితంగా ఉంటాడు, దజ్జాల్ ను విశ్వసించడు, ప్రళయంనాడు నరకపు చెడు నుండి రక్షించబడతాడు”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ426].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ426.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9