ఆదియాత్ సూరహ్

గురు, 05/10/2018 - 17:04

అల్లాహ్ తరపు నుండి మానవులకు సన్మార్గం చూపుటకు అవతరించబడ్డ ఖుర్ఆన్ యొక్క 100వ సూరహ్ అయిన “ఆదియాత్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఆదియాత్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 100వ సూరహ్ ఇది. “ఆదియాత్” అనగా పరుగుతీసే గుర్రాలు. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “ఆదియాత్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో కూడా ఒకేసారి వచ్చింది. ఈ సూరహ్ లో 11 ఆయత్‍లు, 40 పదాలు మరియు 169 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి కూడా రాలేదు. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది(కాని ఉలమాలలో కొందరు మదీనహ్ లో అవతరించబడింది అని అంటారు). దీని కన్నా ముందు “అస్ర్” సూరహ్ మరియు దీని తరువాత “కౌసర్” సూరహ్ అవతరించబడ్డాయి. “ఆదియాత్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ “ఆదియాత్” అన్న పద్దంతో మొదలవ్వడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “నిరంతరం “ఆదియాత్” సూరహ్ ను పఠించేవాడు ప్రళయంనాడు హజ్రత్ అలీ[అ.స] యొక్క ప్రత్యేక సహచరుల నుండి లెక్కించబడతాడు, వారితో మరియు వారి మిత్రులతో పాటు లేపబడతాడు”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ421].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ421.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17