తకాసుర్ సూరహ్

శుక్ర, 05/11/2018 - 18:09

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 102వ సూరహ్ అయిన “తకాసుర్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

తకాసుర్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 102వ సూరహ్ ఇది. “తకాసుర్” పదం ఎక్కువ అనే అర్ధం ఇచ్చే “కస్రత్” అనే పదం నుండి తీసుకోబడినది. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “తకాసుర్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 2 సార్లు(“తకాసుర్” సూరహ్ లో 1 సారి, “హదీద్” సూరహ్ లో 1 సారి) వచ్చింది. ఈ సూరహ్ లో 8 ఆయత్‍లు, 28 పదాలు మరియు 123 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి కూడా రాలేదు. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “కౌసర్” సూరహ్ మరియు దీని తరువాత “మావూన్” సూరహ్ అవతరించబడ్డాయి. “తకాసుర్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ మొదటి ఆయత్ లో “తకాసుర్” అన్న పద్దం ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించెను “ఎవరైతే పడుకునే ముందు “తకాసుర్” సూరహ్ ను పఠిస్తారో అతడు సమాధి శిక్ష నుండి రక్షించబడతాడు”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ430].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ430.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 35