అస్ర్ సూరహ్

శని, 05/12/2018 - 16:59

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 103వ సూరహ్ అయిన “అస్ర్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

అస్ర్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 103వ సూరహ్ ఇది. “అస్ర్” అనగా కాలం. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “అస్ర్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో కూడా ఒకేసారి వచ్చింది. ఈ సూరహ్ లో 3 ఆయత్‍లు, 14 పదాలు మరియు 73 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి కూడా రాలేదు. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “ఇన్షిరాహ్” సూరహ్ మరియు దీని తరువాత “ఆదియాత్” సూరహ్ అవతరించబడ్డాయి. “అస్ర్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ “వల్ అస్ర్” అన్న పద్దంతో మొదలవ్వడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే మస్తహబ్ నమాజులలో “అస్ర్” సూరహ్ ను పఠిస్తాడో ప్రళయంనాడు అల్లాహ్ అతడిని లేపేటప్పుడు అతడి ముఖం మెరిసిపోతూ ఉంటుంది, మరియు నవ్వుతూ ఉంటాడు. మరియు అతడు స్వర్గంలో ప్రవేసిస్తాడు”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ434].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ434.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16