ఖురైష్ సూరహ్

సోమ, 05/14/2018 - 14:52

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 106వ సూరహ్ అయిన “ఖురైష్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఖురైష్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 106వ సూరహ్ ఇది. “ఖురైష్” అనగా ఒక సమూహం. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “ఖురైష్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో కూడా ఒకేసారి వచ్చింది. ఈ సూరహ్ లో 4 ఆయత్‍లు, 17 పదాలు మరియు 76 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి కూడా రాలేదు. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “తీన్” సూరహ్ మరియు దీని తరువాత “ఖారిఅహ్” సూరహ్ అవతరించబడ్డాయి. ఈ సూరహ్ ను “ఖురైష్” కాకుండా “ఈలాఫ్” అని కూడా అంటారు. “ఖురైష్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ యొక్క మొదటి ఆయత్ లో “ఖురైష్” అన్న పదం ఉండడం. ఈ సూరహ్ యొక్క ప్రాముఖ్యత, “ఫీల్” సూరహ్ మాదిరి నమాజులో కేవలం ఈ సూరహ్ చదివితే చాలదు దీనితో పాటు “ఫీల్” సూరహ్ ను చదవాలి. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే “ఖురైష్” సూరహ్ ను ఎక్కువగా పఠిస్తారో అల్లాహ్ అతడికి స్వర్గపు వాహనాన్ని ప్రసాదిస్తాడు.”[సవాబుల్ ఆమాల్].

రిఫ్రెన్స్
సవాబుల్ ఆమాల్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 14 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16