మావూన్ సూరహ్

సోమ, 05/14/2018 - 15:21

.

మావూన్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 107వ సూరహ్ ఇది. “మావూన్” అనగా జీవితం గడపడానికి అవసరమైన చిన్న చిన్న వస్తువులు. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “మావూన్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో కూడా ఒకేసారి వచ్చింది. ఈ సూరహ్ లో 7 ఆయత్‍లు, 25 పదాలు మరియు 114 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి కూడా రాలేదు. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “తకాసుర్” సూరహ్ మరియు దీని తరువాత “కాఫిరూన్” సూరహ్ అవతరించబడ్డాయి. ఈ సూరహ్ ను “మావూన్” కాకుండా “అరాయతల్లజీ”, “అద్దీన్”, “తక్జీబుద్దీన్” అని కూడా అంటారు. “మావూన్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ లో ముఖ్యమైన పదం “మావూన్” ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే వాజిబ్ లేదా ముస్తహబ్ నమాజ్ లో “మావూన్” సూరహ్ ను పఠిస్తారో అల్లాహ్ అతడి నమాజ్ మరియు ఉపవాసాలను అంగీకరిస్తాడు మరియు ఈలోకం గురించి అతడికి ప్రశ్నించబడదు.”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ454].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ454.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12