మంగళ, 05/15/2018 - 14:57
అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండేవారి ఫలితాల క్రమంలో పరలోక ఫలితాల వివరణ.
ఖుర్ఆన్ లో ధర్మనిష్ఠ యొక్క ఫలితాలను మూడు రకాలుగా వివరించడం జరిగింది. 1. ప్రాపంచిక ఫలితాలు. 2. పరలోక ఫలితాలు. 3. నిరంతర ఫలితాలు. ఇక్కడ మేము కేవలం పరలోక ఫలితాలను వివరిస్తున్నాము.
1. నిశ్చయంగా భయభక్తులు గలవారు(స్వర్గ) వనాలలో, సుఖసౌఖ్యాలలో ఉంటారు.[తూర్:17]
2. అన్నింటి కంటే అత్యుత్తమ సామాగ్రి దైవభీతియే.[బఖర:197]
3. అల్లాహ్ భీతిపరుల నజరానాను మాత్రమే స్వీకరిస్తాడు.[మాయిదహ్:27]
4. ఎవడు అల్లాహ్ కు భయపడతాడో అతని పాపాలను అల్లాహ్ అతని నుండి రూపుమాపుతాడు. అతనికి గొప్ప పుణ్యఫలాన్ని వోసగుతాడు.[తలాఖ్:5].
5. మేము భయభక్తులు కలిగివున్న వారిని రక్షిస్తాము. దుర్మార్గులను అందులో మోకాళ్లపై పడి ఉన్న స్థితిలోనే వదిలేస్తాము.[మర్యామ్:72].
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి