19, 21వ రాత్రి యొక్క ప్రత్యేక ఆమాల్

ఆది, 06/03/2018 - 09:45

రమజాన్ నెల 19, 21వ రాత్రి యొక్క ప్రత్యేకత మరియు ఆ రాత్రి చేయవలసిన ఆమాల్ వివరణ.

19వ రాత్రి యొక్క ప్రత్యేక ఆమాల్

రమజాన్ నెల 19వ రాత్రి షబే ఖద్ర్ కాకుండా ఇంకో విషాద సంఘటన జరిగిన రాత్రి, ఆ రాత్రి చివరి సమయంలో అనగా ఫజ్ర్ నమాజ్ సమయంలో మస్జిదే కూఫాలో నమాజ్ చదువుతుండగా దైవప్రవక్త[స.అ] ఉత్తరాధికారి అయిన హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) యొక్క తలపై ఇబ్నె ముల్జిమె మూరాదీ అనబడే దుర్మార్గుడు దాడి చేశాడు, దాని ప్రభావం ద్వారా అప్పటి నుండి మూడు రోజుల కన్న ఎక్కువ ఈ లోకంలో ఉండలేకపోయారు. 21వ రోజు వారు మరణించారు.
వారు గాయపడిన వెంటనే ఇలా అన్నారు “ఫుజ్తు వ రబ్బిల్ కాబా” అనగా అల్లాహ్ సాక్షిగా నేను సాఫల్యాన్ని పొందాను. ఈ ఒక్క మాట వారి జీవితం ఎలా గడిచిందిదో తెలుసుకోవడానికి నిదర్శనం. ఈ రెండు రాత్రులు ఈ లింక్ https://www.te.welayatnet.com/node/466 లో ఉన్న ఆమాల్ తో పాటు క్రింద చెప్పబడిన ప్రత్యేక ఆమాల్ ను నిర్వర్తించాలి.
1. అస్తగ్ఫిరుల్లాహ రబ్బీ వ అతూబు ఇలైహ్” 100 సార్లు.
2. అల్లాహుమ్మల్ అన్ ఖతలత అమీరిల్ మొమనీన్” 100 సార్లు.
ఈ రాత్రుళ్ళలో పఠించవలసిన పలు దుఆల కోసం మీరు మఫాతీహుల్ జినాన్ గ్రంథాన్ని చూడగలరు.

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, రమజాన్ నెల ఆమాల్ అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by zaheer on

Shukriya msgs k zariye himmat afzaei karne ka.. iltemase dua.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 34