ఖుర్ఆన్ యొక్క 9వ పారహ్

బుధ, 06/13/2018 - 10:04

పవిత్ర ఖుర్ఆన్ యొక్క 9వ పారహ్ లో ఉన్న అంశాల గురించి సంక్షిప్త వివరణ.

ఖుర్ఆన్ యొక్క 9వ పారహ్

ఖుర్ఆన్ యొక్క 9వ పారహ్ లో రెండు భాగాలు ఉన్నాయి. 1. ఆరాఫ్ సూరహ్ మిగిలిన భాగం, 2. అన్ఫాల్ సూరహ్ యొక్క మొదలు.  
మొదటి భాగంలో 9 అంశాలున్నాయి: 1. హజ్రత్ మూసా[అ.స] యొక్క సూధిర్ఘ సంఘటన, 2. ఇస్మె ఆజామ్ కలిగి ఉన్న బల్అమె బావూరా ప్రస్తావనం, 3. అలస్తు రబ్బుకుమ్(నేను మీ ప్రభువును కానా!?) ప్రమాణ ప్రస్తావనం, 4. దైవప్రవక్త “ఉమ్మీ”(దీని అర్ధం అన్కబూత్ సూరహ్ ఆయత్ 44లో ఉంది) అన్న ప్రస్తావనం, 5. అల్లాహ్ కు మంచి మంచి పేర్లున్నాయనే ప్రస్థావనం, 6. దైవప్రవక్త[స.అ]ల గోప్యజ్ఞానం అల్లాహ్ అనుగ్రహం లేకుండా అసాధ్యం అన్న ప్రస్తావనం, 7. అవిశ్వాసులందరూ చతుష్పాత్తులతో సమానం అన్న ప్రస్తావనం, 8. ప్రళయం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికి తెలియదు ఒక్క అల్లాహ్ కు తప్ప, 9. ఖుర్ఆన్ యొక్క గొప్పతనం మరియు మహిమ ప్రస్తావనం.
రెండవ భాగంలో 5 అంశాలున్నాయి: 1. విశ్వాసుల ఐదు గుణాలు; అల్లాహ్ ప్రస్తావన రాగానే వారి హృదయాలు భయంతో వణుకుతాయి, తిలావత్ చేస్తారు, అల్లాహ్ నే నమ్ముతారు, నమాజ్ ను నెలకొల్పుతారు, అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడతారు. 2. “బద్ర్” యుద్ధం ప్రస్తావనం. 3. దైవప్రవక్త[స.అ]ను హతమార్చాలన్న అవిశ్వాసుల కుట్రకు వ్యతిరేకంగా అల్లాహ్ ఉపాయం మరియు హజ్రత్ అలీ[అ.స]ను తన పాన్పుపై పరుండబెట్టి దైవప్రవక్త[స.అ] మదీనహ్ కు హిజ్రత్ చేసిన ప్రస్తావనం. 4. ఇమామ్ అలీ[అ.స] యొక్క విలాయత్ ప్రచారాన్ని అంగీకరించని వాడి పై అల్లాహ్ శాపం యొక్క ప్రస్తావనం. 5. మస్జిదుల్ హరామ్ యొక్క ముతవల్లీలు కేవలం ధర్మనిష్ఠ గలవారే, అన్న ప్రస్తావనం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18