ఖుర్ఆన్ యొక్క 7వ పారహ్

మంగళ, 06/12/2018 - 12:57

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ ఖుర్ఆన్ యొక్క 7వ పారహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఖుర్ఆన్ యొక్క 7వ పారహ్

7వ పారహ్ లో రెండు భాగాలున్నాయి: 1. మాయిదహ్ సూరహ్ మిగిలిన భాగం 2. అన్ఆమ్ సూరహ్ మొదలు.
మొదటి భాగంలో నాలుగు అంశాలున్నాయి: 1. హబషహ్ కు చెందిన క్రైస్తవుల ప్రస్తావనం. 2. ఎక్కువ శాతం ఉండడం అది సరైనది అనడానికి నిదర్శనం కాదు అన్న వివరణ. 3. హలాల్ మరియు హరామ్ కు చెందిన కొన్ని సమస్యల ప్రస్తావనం. 4. అంతిమ దినం మరియు హజ్రత్ ఈసా[అ.స] ప్రస్తావనం.
రెండవ భాగంలో మూడు అంశాల చర్చ ఉంది: 1. అల్లాహ్ యొక్క తౌహీద్, ఘనత మరియు మహిమల ప్రస్థావనం ఉంది. 2. దౌత్య ప్రస్తావనం, దైవప్రవక్త[] దౌత్వం సమస్త ప్రపంచానికి చెందినది, కేవలం ఒక పట్టణానికో లేదా ఏదో ఒక దేశానికో పరిమితం కాదు. 3. అంతిమదినాన అల్లాహ్ మానవులందరిని సంగ్రహిస్తాడనీ, ఆరోజు శిక్షను రద్దు చేయబడడం ఆ మానవుని పై అల్లాహ్ యొక్క అనంతమైన కరుణకే సాధ్యమనీ, మష్రికులను మీ ప్రభువులెవరని ప్రశ్నించబడతారనీ, నరకవాసులు ఒక అవకాశం ఇస్తే ఈ లోకానికి తిరిగి వచ్చి అల్లాహ్ ను విశ్వసిస్తామనే కోరిక వ్యక్తం చేస్తారనీ, ఈ ప్రపంచం ఒక ఆటభూమీ పరలోక జీవితం చాలా మంచిదనీ మరియు అల్లాహ్ ను మన కళ్ళతో చూడలేమని ప్రస్తావించబడి ఉంది. 4. సద్గుణ అంశాల ప్రస్తావన ఉదాహారణకు తౌబా యొక్క యదార్థం, అల్లాహ్ చిహ్నాలను హేళన చేసే సభలకు ప్రముఖ వ్యక్తులు తప్ప వేరే వాళ్ళు వెళ్ళకూడదని ఆదేశించబడి ఉంది, ఎదుటి వాడు శత్రువైనా సరే దూషించడం సరైన విషయం కాదని ప్రస్తావించబడి ఉంది.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18