ఖుర్ఆన్ యొక్క 21వ పారహ్

మంగళ, 06/26/2018 - 16:18

అల్లాహ్ యొక్క పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ యొక్క 21వ పారహ్ గురించి సంక్షిప్త వివరణ.

ఖుర్ఆన్ యొక్క 21వ పారహ్

ఖుర్ఆన్ యొక్క 21వ పారహ్ లో ఐదు భాగాలున్నాయి: 1. అన్కబూత్ సూరహ్ యొక్క మిగిలిన భాగం 2. పూర్తి రూమ్ సూరహ్ 3. పూర్తి లుఖ్మాన్ సూరహ్ 4. పూర్తి సజ్దహ్ సూరహ్, 5. అహ్జాబ్ సూరహ్ మొదలు.
మొదటి భాగంలో నాలుగు అంశాలున్నాయి: 1. ఖుర్ఆన్ పఠనం మరియు నమాజ్ ఆదేశం ప్రస్తావనం, 2. నమాజ్ యొక్క ప్రతిష్టిత(ఇది చెడు మరియు నిర్లజ్జతనం నుండి ఆపుతుంది), 3. శత్రువుల మరియు వారి అక్రమం యొక్క ప్రస్తావనం, 4. ప్రపంచం స్థిరమైనది కాదన్న ప్రస్తావనం.
రెండవ భాగంలో రెండు అంశాలున్నాయి: 1. రెండు కాలజ్ఞానముల ప్రస్తావనం; A. తొమ్మిది సంవత్సరాల లోపే రూమ్ దేశానికి చెందిన అహ్లె కితాబ్(క్రైస్తవులు) ఇరాన్ దేశానికి చెందిన విగ్రాహారాధన చేసేవారిని అపజయానికి గురి చేస్తారు. B. అదే సమయంలో ముస్లిములు, ఖురైష్ కు చెందిన ముష్రికుల పై విజయం సాధించిన ఆనందంలో ఉంటారు(ఇది బద్ర్ యుద్ధంలో వారి సొంతం అయ్యింది). 2. తౌహీద్ ప్రస్తావనం క్రమంలో అల్లాహ్ యొక్క ఏడు గుర్తుల ప్రస్తావనం.
మూడవ భాగంలో మూడు అంశాలున్నాయి: 1. తౌహీద్, అల్లాహ్ యొక్క శక్తిసామర్థ్యాల పై నాలుగు సాక్ష్యాలు, 2. హజ్రత్ లుఖ్మాన్, తన కుమారుడికి చేసిన ఆదు వసీయత్ల ప్రస్తావనం, 3. తౌహీద్ క్రమంలో అల్లాహ్ కు మాత్రమే తెలిసిన ఐదు విషయాల గురించి చెప్పబడింది.
నాలుగోవ భాగంలో నాలుగు అంశాలున్నాయి: 1. ఖుర్ఆన్ యొక్క ప్రతిష్టత, 2. తౌహీద్, 3. ప్రళయంలో పాపాత్ములు మరియు విశ్వాసుల స్థతిగతుల ప్రస్తావనం, 4. రిసాలత్ క్రమంలో హజర్త మూసా(అ.స)కు తౌరైత్ ఇవ్వబడిన ప్రస్తావనం.
సూచన: సజ్దాహ్ సూరహ్ యొక్క 15వ ఆయత్ లో వాజిబ్ సజ్దా ఉంది.
ఐదవ భాగంలో రెండు అంశాలున్నాయి: 1. అజ్ఞానపు కాలం(ఇస్లాం రాక ముందు కాలం) నాటి మూడు తప్పుడు అభిప్రాయాలు రద్దు చేయబడ్డ ప్రస్తావనం. 2. రెండు యుద్ధాల(అహ్జాబ్ మరియు బనీ ఖరీజహ్) యొక్క ప్రస్తావనం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 35