దైవప్రవక్త[స.అ] తల వెంట్రుకలు

శుక్ర, 07/20/2018 - 08:10

అనుచరుడు తెచ్చిన దైవప్రవక్త[స.అ] తల వెంట్రుకలు నిజమైనవా కావా, అన్న విషయాన్ని ఇమామ్[అ.స] ఎలా తీర్మానించారు అన్న విషయం.

దైవప్రవక్త[స.అ] తల వెంట్రుకలు

ఒకరోజు అన్సారుల మనవళ్ల నుండి ఒకడు ఇమామ్ రిజా[అ.స] వద్దకు వచ్చి సిల్వర్ రంగులో ఉన్న ఒక బాక్స్ ను ఇమామ్ కు అందజేస్తూ ఇలా అన్నాడు: “స్వామీ! మీ కోసం ఎవ్వరూ తీసుకురానటువంటి కానుకను తీసుకొని వచ్చను” ఆ తరువాత ఆ బాక్స్ ను తెరిచి అందులో నుండి ఏడు తల వెంట్రుకలను బయటకు తీసి ఇలా అన్నాడు:  “ఈ ఏడు తల వెంట్రుకలు దైవప్రవక్త[స.అ] తల వెంట్రుకలు, ఇవి నాకు నా పూర్వీకుల నుండి దక్కాయి”
హజ్రత్ ఇమామ్ రజా[అ.స] ఆ ఏడు తల వెంట్రుకల నుండి నాలుగు వెంట్రుకలను వేరు చేసి ఇలా అన్నారు: “ఈ నాలుగు వెంట్రుకలు మాత్రమే దైవప్రవక్త[స.అ] వెంట్రుకలు”
ఆ వ్యక్త ఏమీ చెప్పకుండా ఆశ్చర్యం మరియు కొద్దిగా నిరాశగా ఇమామ్ వైపు చూశాడు. అతడు నిరాశ చెందాడని తెలుసుకున్న ఇమామ్[అ.స] ఆ మూడు వెంట్రుకలను నిప్పు పై పెట్టారు అవి కాలిపోయాయి, కాని మగిలిన ఆ నాలుగు వెంట్రుకలు నిప్పు పై పెట్టగానే మిలమిల మెరవడం మొదలెట్టాయి, ఆ కాంతి ఆ వ్యక్తి యొక్క ముఖాన్ని కాంతివంతం చేశాయి.[మజల్లయే హునరె దీనీ, షుమారహ్ 6]

రిఫ్రెన్స్
దీవానె ఖుదా, నయీమహ్ దూస్త్ దార్, ఇంతెషారాతె మద్రసెహ్, 1997.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15