దహ్ఉల్ అర్జ్ యొక్క అర్ధం

బుధ, 08/01/2018 - 14:49

జరిగిన సంఘటనకు మరియు దాని పేరుకు తప్పకుండా సంబంధం ఉంటుంది, ఆ సంబంధం తెలుసుకోవాలంటే దాని యొక్క అర్థం తెలుసుకోవాలి అందుకే కొన్ని నింఘంటువుల నుండి దాని అర్థం యొక్క వివరణ.

దహ్ఉల్ అర్జ్ యొక్క అర్ధం

నిస్సందేహముగా వస్తువుల యదార్థాలు తెలుసుకుంటే, అవే మనకు అల్లాహ్ యొక్క ఆదేశాలు తెలుసుకోవడానికి కారణం అవుతాయి. అందుకనే “దహ్ఉల్ అర్జ్” యొక్క అర్థం తెలుసుకోవడం అవసరం అని భావించి ఇక్కడ ఇస్లామీయ నిఘంటుకారులు ఆ పదానికి ఎలా వివరించారో తెలుకుందా. చాలా అర్ధాలు ఉల్లేఖించబడి ఉన్నాయి కాని ఇక్కడ సంక్షిప్తంగా చెప్పడం జరుగుతుంది. “జౌహరీ” “దహూ” అనగా “వ్యాపించడం”, మరియు “దొర్లించడం”[ఇబ్నె సీనా, షిఫా] అనీ, కొందరు కొందరు “పెంచడం” అని అన్నారు[ఇబ్నె మన్జూర్, లిసానుల్ అరబ్]. మరి “రాగిబె ఇస్ఫెహానీ” “ఒక ప్రదేశం నుండి తీయడం(పీకడం)” అని అంటారు[బర్ గుజీదె తఫ్సీరె నమూనహ్]. ఇస్లామీయ ఉలమాల అభిప్రాయం ప్రకారం, ఒకవేళ «دحی» ను «دحو» అన్న పదం నుండి తీసుకున్నట్లైతే దాని అర్ధం “గట్టిగా విసరడం” అని. అంటే సృష్టి మొదటి దశలో భూమి తన మూలం నుండి విడదీయబడడాన్ని సూచిస్తుంది[అల్ జుర్జానీ, కితాబుత్తారీఫాత్]. వీటన్నింటిని కలిపి ఒక మాటలో చెప్పాలంటే “దహ్ఉల్ అర్జ్” అనగా “భూమి విస్తరణ”[దురూసె హైఅత్ వ దీగర్ రిష్తెహాయే రియాజీ, భాగం2].

రిఫ్రెన్స్
ఇబ్నె సీనా, షిఫా, తస్హీహె అల్లామా హసన్ జాదె ఆములి, అల్ తబవుర్రిహలీ, బీ.తా. ఇబ్నె మన్జూర్, లిసానుల్ అరబ్, చాప్3, దారె సాదిర్, బీరూత్, 1414 హిజ్రీ. బాబాయి, బర్ గుజీదె తఫ్సీరె నమూనహ్, చాప్13, దారుల్ కుతుబిల్ ఇస్లామియ్యహ్, తెహ్రాన్, 1382 షంమ్సీ. అల్ జుర్జానీ, కితాబుత్తారీఫాత్, నాసిర్ ఖుస్రో, తెహ్రాన్, బీ.తా. హసన్ జాదెహ్ ఆములీ, దురూసె హైఅత్ వ దీగర్ రిష్తెహాయే రియాజీ, భాగం2, చాప్3, బూస్తానె కితాబ్, ఖుమ్, 1386.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17