జిల్ హిజ్ మాసం మొదటి పది రోజులు

ఆది, 08/12/2018 - 18:38

జిల్ హిజ్ మాసం మొదటి పది రోజులు చాలా ప్రతిష్టగలవి, ఆ రోజులలో కొన్ని ప్రార్ధనలు ఉన్నాయి. వాటి వివరణ.

జిల్ హిజ్ మాసం మొదటి పది రోజులు

“జిల్ హిజ్” నెల యొక్క మొదటి పది రోజులను “అయ్యామె మాలూమాత్” అంటారు. దీని ప్రస్తావనం ఖుర్ఆన్ లో ఉంది. దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం ప్రకారం, ఈ పది రోజులలో చేసే పుణ్యకార్యములు మరియు ప్రార్ధనలు అల్లాహ్ దృష్టిలో మిగిలిన రోజులలో అమలు పరిచేవాటి కన్నా ఇష్టమైనవి. ఈ పది రోజులలో కొన్ని ప్రార్ధనలు ఉన్నాయి. వాటి వివరణ:
1. మొదటి 9 రోజులు ఉపవాసం ఉండడం. ఈ ఉపవాసం యొక్క పుణ్యం పూర్తి వయసు ఉపవాస పుణ్యం కలదు.
2. ఈ పది రోజుల రాత్రులలో మగ్రిబ్ మరియు ఇషాఁ నమాజ్ మధ్యలో రెండు రక్అత్ల నమాజ్ ను ఈ విధంగా చదవడం; ప్రతీ రక్అత్ లో అల్ హంద్ సూరహ్ తరువాత ఒకసారి ఇఖ్ లాస్ సూరహ్ ను చదివిన తరువాత ఈ ఆయత్ ను చదవాలి: “వ వాఅద్నా మూసా తలాతీన లైలతన్ వ అత్ మమ్నాహా బి అష్రి, ఫతమ్మ మీఖాతు రబ్బిహి అర్బయీన లైలతన్ వ ఖాల మూసా లి అఖీహి హారూనఖ్ లుఫ్నీ ఫీ ఖౌమీ వ అస్లిహ్ వలా తత్తబిఅ’ సబీలల్ ముఫ్సిదీన్” ఈ నమాజ్ చదివిన వారు, హజ్ చేసిన వారి పుణ్యంలో భాగస్వాములవుతారు.

ఇవి కాకుండా ఈ పది రోజులలో చదవవలసిన దుఆలు ఉన్నాయి. వాటిని మఫాతీహుల్ జినాన్ నుండి చదవ గలరు.[మఫాతీహుల్ జినాన్, పేజీ440].

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, మతర్జిమ్ ఇలాహీ ఖుమ్షెయి, ఇంతెషారాతె ఉస్వహ్, 1379.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13