ఇస్లామీయ మాసముల క్రమంలో చివరి మాసం హిల్ హిజ్ మాసం, ఈ మాసంలో సంభవించిన కొన్ని ముఖ్యాంశాల వివరణ.
1వ తారీఖు: హిజ్రీ యొక్క 2వ సంవత్సరంలో ఇమామ్ అలీ[అ.స] మరియు హజ్రత్ ఫాతెమా[స.అ] వివాహం జరిగింది. హిజ్రీ యొక్క 9వ సంవత్సరంలో “బరాఅత్” ఆయత్లను ఇచ్చి పంపేందుకు అబూబక్ర్ కు బదులు ఇమామ్ అలీ[అ.స]ను ఎన్నుకోవడం జరిగింది.
3వ తారీఖు: హిజ్రీ యొక్క 10వ సంవత్సరంలో దైవప్రవక్త[స.అ] తన అంతిమ హజ్ కోసం మక్కాలో ప్రవేసించారు.
5వ తారీఖు: హిజ్రీ యొక్క 2వ సంవత్సరంలో “సవీఖ్” యుద్ధం జరిగిన రోజు.
6వ తారీఖు: హిజ్రీ యొక్క 158వ సంవత్సరంలో “మన్సూర్ దవానెఖీ” మరణించాడు.
8వ తారీఖు: హిజ్రీ యొక్క 60వ సంవత్సరంలో ఇమామ్ హుసైన్[అ.స]ను కాబా వద్ద హతమార్చాలని కుట్ర పన్నిన విషయం తెలుసుకొని ఇమామ్ మక్కా నుండి ఇరాఖ్ కు బయలుదేరారు.
9వ తారీఖు: అరఫహ్ రోజు. ఒక రివాయత్ ప్రకారం హజ్రత్ ఆదమ్[అ.స] యొక్క తౌబహ్ అంగీకరించబడింది. హిజ్రీ యొక్క 60వ సంవత్సరంలో హజ్రత్ ముస్లిమ్ ఇబ్నె అఖీల్[అ.స]ను మోసగించి చంపారు.
10వ తారీఖు: ఈదుల్ అజ్హా(ఖుర్బాన్ పండగా).
11వ తారీఖు: హిజ్రీ యొక్క 25వ సంవత్సరంలో “దుఆయే సబాహ్” లిఖించబడింది.
13వ తారీఖు: హజ్రత్ ఇస్మాయీల్[అ.స] యొక్క తల్లి హాజిరహ్ మరణించిన రోజు. బేసత్ యొక్క 5వ సంవత్సరంలో దైవప్రవక్త[అ.స] ద్వార “షఖ్ఖుల్ ఖమర్” అద్భుతం సంభవించింది.
14వ తారీఖు: హిజ్రీ యొక్క 7వ సంవత్సరంలో అల్లాహ్ ఆయత్ అవతరణ తరువాత దైవప్రవక్త[స.అ] “ఫిదక్” తోటను కానుకగా ఇచ్చారు. హిజ్రీ యొక్క 10వ సంవత్సరంలో దైవప్రవక్త[అ.స] తమ అంతిమ హజ్ చేసుకొని మక్కా నుండి మదీనహ్ వైపుకు బయలుదేరారు.
15వ తారీఖు: హిజ్రీ యొక్క 212వ సంవత్సరంలో ఇమామ్ అలీ నఖీ[అ.స] జన్మించారు.
17వ తారీఖు: హిజ్రీ యొక్క 952వ సంవత్సరంలో షియా వర్గానికి చెందిన ప్రముఖ ఆలిమ్ షేఖ్ బహాయీ[ర.అ] జన్మించారు.
18వ తారీఖు: గదీర్ పండగ(హిజ్రీ యొక్క 10వ సంవత్సరం). ప్రవక్త నూహ్[అ.స] కాలంలో వచ్చిన తుపాను ఆగిపోయిన రోజు. ప్రవక్త ఇబ్రాహీమ్ కోసం అంటించిన నిప్పు పూదోటగా మార్చబడిన రోజు. హిజ్రీ యొక్క 35వ సంవత్సరంలో ఉస్మాన్ ఇబ్నె అప్వాన్ మరణించారు మరియు ప్రజలు హజ్రత్ ఇమామ్ అలీ[అ.స] చేతుల పై బైఅత్ చేశారు.
22వ తారీఖు: హిజ్రీ యొక్క 60వ సంవత్సరంలో “మీసమే తమ్మార్” చంపబడ్డారు.
24వ తారీఖు: హిజ్రీ యొక్క 9వ సంవత్సరంలో క్రైస్తవులతో ముబాహలహ్ జరిగింది. “ముబాహలహ్” మరియు “తత్హీర్” ఆయత్లు అవతరించబడ్డాయి. నమాజ్ లో రుకూ చేస్తూ ఇమామ్ అలీ[అ.స] తన ఉంగరాన్ని యాచకుడికి ఇచ్చారు.
25వ తారీఖు: “దహ్ర్” సూరహ్ అవచరించబడిన రోజు. ఉస్మాన్ మరణించిన తరువాత ఖిలాఫత్ పదవిని ఇమామ్ అలీ[అ.స] స్వీకరించిన రోజు.
27వ తారీఖు: హిజ్రీ యొక్క 23వ సంవత్సరంలో ఉమర్, అబూలూలూ చేత గాయపడిన (లేదా ఒక రివాయత్ ప్రకారం మరణించిన) రోజు.
28వ తారీఖు: హిజ్రీ యొక్క 63వ సంవత్సరంలో “హర్రా” సంఘటన సంభవించింది.
30వ తారీఖు: హిజ్రీ యొక్క 13వ సంవత్సరంలో అబూబక్ర్ తండ్రి అబూఖహాఫహ్ ఇబ్నె ఆమిర్ మరణించాడు. హిజ్రీ యొక్క 13వ సంవత్సరంలో అబూసుఫ్యాన్ భార్య హింద మరణించింది. హిజ్రీ యొక్క 23వ సంవత్సరంలో ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ మరణించారు.
వ్యాఖ్యానించండి