ఉపవాసం యొక్క ప్రాముఖ్యత మరియు పుణ్యం

శుక్ర, 05/11/2018 - 17:58

ఉపవాసం యొక్క ప్రాముఖ్యత మరియు పుణ్యం గురించి దైవప్రవక్త[స.అ] యొక్క కొన్ని సరైన హదీసులు.

ఉపవాసం యొక్క ప్రాముఖ్యత మరియు పుణ్యం

1. ఇస్లాం ఒక దృడమైన వృక్షం లాంటిది, విశ్వాసం దాని వేర్లు, నమాజ్ దాని నరాలు, జకాత్ దాని నీరు మరియు ఉపవాసం దాని ఆకులూ, కొమ్మలు.
2. నమాజ్ మరియు ఉపవాసం నా కనుల కాంతి.
3. ఎవరైతే అల్లాహ్ కోసం, మండుటెండలో ఒకరోజు ఉపవాసం ఉంటాడో దానితో పాటు అతడికి తట్టుకోలేని దాహం కూడా తోడైతే, అల్లాహ్ వెయ్యి దూతలను అతడి ముఖాన్ని తాకేందుకు మరియు అతడికి శుభవార్త ఇచ్చేందుకు నియమిస్తాడు. ఇఫ్తార్ సమయంలో, అల్లాహ్ “నీ ఆత్మ ఎంత మంచిదో, ఓ నా దుతలారా! నేను అతడిని క్షమించానని సాక్ష్యమివ్వండి” అని అంటాడు.
3. ఉపవాస దీక్షను నిర్వర్తిస్తున్న వ్యక్తి చాడీలు చెప్పనంత వరకు, దైవారాధనలో ఉన్నట్లే, చివరికి పడుకొని ఉన్నా సరే.
4. ఉపవాసి యొక్క నిద్ర దైవారాధన; అతడి మౌనం తస్బీహ్; అతడి దుఆ అంగీకరించబడినది మరియు అతడి కార్యము యొక్క పుణ్యం రెండింతలు.
5. అల్లాహ్, ఒక దస్తర్ఖాన్ కలిగి ఉన్నాడు, అందులో కనీవినీ ఎరుగని మరియు ఏ ఒక్క మానవుని ఆలోచనకు రాని నేమత్ ఉంది. ఆ దస్తర్ఖాన్ పై ఒక ఉపవాసి తప్ప మరొకడు కూర్చోవడానికి అర్హుడు కాడు.

రిఫ్రెన్స్
షేఖ్ కులైనీ, అల్ కాఫీ, బాబుస్సౌమ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14