ఇస్లామీయ క్యాలండర్ ప్రకారం 11వ మాసం అయిన జిల్ హిజ్ మొదటి రోజు చేయవలసిన కొన్ని ప్రార్ధనలు.
1. ఉపవాసం ఉండడం. ఈ ఉపవాసం ఎనభై నెలల పుణ్యం కలిగి ఉన్న ఉపవాసం.
2. నమాజె హజ్రతే ఫాతేమా[స.అ] చదవడం మంచిది అని ఉల్లేఖించబడి ఉంది. రెండేసి రక్అత్ల చొప్పున రెండు నమాజులు ప్రతీ రక్అత్ లో అల్ హంద్ సూరహ్ తరువాత యాభై సార్లు సూరయే తౌహీద్ చదవాలి. నమాజ్ పూర్తయిన తరువాత తస్బీహ్ ను పఠించి ఈ దుఆను చదవాలి: “సుబ్హాన ౙిల్ ఇజ్జిష్షామిఖిల్ మునీఫ్, సుబ్హాన ౙిల్ జలాలిల్ బాజిఖిల్ అజీమ్, సుబ్హాన ౙిల్ ముల్కిల్ ఫాఖిరిల్ ఖదీమ్, సుబ్హాన మన్ యరా అసరన్నమ్లతి ఫీస్సఫా, సుబ్హాన మన్ యరా వఖఅత్తైరి ఫిల్ హవా, సుబ్హాన మన్ హువ హాకౙా వలా హాకజా గైరుహ్”
3. ౙవాల్(జొహ్ర్ సమయానికి ఒక అర గంట ముందు) కన్నా ముందు రెండు రక్అత్ లు ప్రతీ రక్అత్ లో అల్ హంద్ సూరహ్ తరువాత పది సార్లు సూరయే తౌహీద్, ఆయతల్ కుర్సీ మరియు సూరయే ఖద్ర్ ను చదవాలి.
4. దుర్మార్గుడి దుర్మార్గం నుండి ఎవరైనా భయపడుతుంటే వారు ఈ రోజున ఇలా చదవాలి: “హస్బీ హస్బీ హస్బీ మిన్ సువాలీ ఇల్ముక బిహాలీ” దాంతో అల్లాహ్ అతడిని దుర్మార్గుని అరాచకం నుండి కాపాడుతాడు.
* జిల్ హిజ్ మాసం యొక్క 8వ తారీఖును “తర్వియహ్” రోజు అంటారు. ఆ రోజు ఉపవాసం ఉండాలి. ఒక రివాయత్ ఉల్లేఖనం ప్రకారం ఆ ఉపవాసం 60 ఏళ్ల పరిహారం(తో సమానం).[మఫాతీహుల్ జినాన్, పేజీ444].
రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, మతర్జిమ్ ఇలాహీ ఖుమ్షెయి, ఇంతెషారాతె ఉస్వహ్, 1379.
వ్యాఖ్యానించండి