బుద్ధి జ్ఞానాల గురించి పవిత్ర మాసూముల కొన్ని హదీసులు షియా మూల గ్రంథాల నుండి.
ఒకరోజు ఒకవ్యక్తి ఇమామ్ జాఫర్ సాదిఖ్[అ.స] వద్దకు వచ్చి, బుద్ధి అనగానేమి? అని ప్రశ్నించాడు. ఇమామ్ ఇలా సమాధానమిచ్చారు: “అల్లాహ్ పట్ల విధేయత మరియు స్వర్గాన్ని పొందేందుకు కారణమయ్యేది” ఆ వ్యక్తి మరలా ఇలా ప్రశ్నించాడు: అయితే ‘ముఆవియ’ వద్ద ఉండేది ఏమిటి? ఇమామ్: “అది జిత్తు, మోసం, అది పైశాచికం, అది బద్ధిలా కనిపిస్తుంది కాని అది బుద్ధి కాదు”.
ఇమామ్ రిజా[అ.స] ఇలా ప్రవచించారు: “మనిషి యొక్క మిత్రుడు అతడి బుద్ధి మరియు అతడి శత్రువు అతడి అజ్ఞానం”.
ఇమామ్ జాఫర్ సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను: “ప్రతీ బుద్ధిమంతుడు దీన్(ధర్మం) కలిగి ఉంటాడు, దీన్ కలిగి ఉన్నవాడు స్వర్గానికి వెళతాడు”. (అంటే బుద్ధిమంతుడు స్వర్గానికి వెళతాడు).
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] ఇలా ప్రవచించెను: “అల్లాహ్ ప్రళయం నాడు తన దాసులను వారికి ప్రపంచంలో ప్రసాదించబడిన బుద్ధి పరంగా వారి నుండి లెక్కతీసుకుంటాడు” [ఉసూలె కాఫీ, భాగం1, పేజీ11-12].
రిఫ్రెన్స్
మర్హుమ్ కులైనీ, ఉసూలె కాఫీ, ముస్తఫవీ, కితాబ్ ఫురూషియె ఇల్మియయే ఇస్లామియ, తెహ్రాన్, 1369.
వ్యాఖ్యలు
Mashalla
Good information about knowledge
Thanks
Iltemase Dua.
Mashaallah
Shukriya.
Mashaallah
Shukriya...
వ్యాఖ్యానించండి