హజ్రత్ అలీ(అ.స) తీర్పు పట్ల హజ్రత్ ఉమర్ అంగీకారం, అహ్లె సున్నత్ హదీస్ గ్రంథాలాధారంగా...
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
తీర్పు ఇచ్చే విషయంలో హజ్రత్ అలీ(అ.స) ప్రతిష్టతను, హజ్రత్ ఉమర్ ఒప్పుకున్నారా? అన్న విషయం పై సంక్షిప్త వివరణ...
దైవప్రవక్త(స.అ) చాలా సార్లు ఇమామ్ అలీ(అ.స) యొక్క తీర్పు ఇచ్చే విషయంలో ఇలా వివరణ ఇచ్చారు: “తీర్పు ఇవ్వడంలో అత్యంత నైపుణ్యం గల వ్యక్తి హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స)”.[1]
దీని క్రమంలోనే మేము చూసుకున్నట్లైతే, బుఖారీ తన గ్రంథం సహీ లో ఇబ్నె అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారం ఉమర్ కూడా ఇలా అన్నారు: “మాలో అత్యుత్తమ ఖారీ(ఖుర్ఆన్ పారాయణం) ఉబయ్ మరియు అత్యుత్తమ తీర్పునిచ్చేవారు అలీ(అ.స)”[2]
ఇదే విధంగా తబఖాతుల్ కుబ్రా గ్రంథంలో; ఖాలిద్ ఇబ్నె ముఖల్లదె బజలీ, యజీద్ ఇబ్నె అబ్దుల్ మలిక్ ఇబ్నె ముగైరహ్ నౌఫిలీ నుంది, అలీ ఇబ్నె మొహమ్మద్ ఇబ్నె రబీఅహ్ నుండి, అబ్దుర్ రహ్మాన్ ఇబ్నె హుర్ ముజ్ అఅరజ్ నుండి, అబూ హురైరహ్ నుండి ఇలా ఉల్లేఖించారు: ఉమర్ ఇలా అన్నారు: “అలీ(అ.స) మనలో తీర్పు విషయంలో ఎక్కువ జ్ఞానం కలిగివున్నవారు”.[3]
ఇదే విధంగా ఇబ్నె అబ్బాస్ ద్వారా ఇలా ఉల్లేఖించబడి ఉంది: ఉమర్ మా కోసం ఉపన్యాసం ఇచ్చారు వారు ఇలా అన్నారు: మనలో అలీ(అ.స) ఎక్కువ జ్ఞానం కలిగివున్నవారు తీర్పు విషయంలో మరియు మనలో ఉబయ్ ఖిరాఅత్ (ఖుర్ఆన్ పఠించడం) లో ఎక్కవగా జ్ఞానం కలిగివున్నవారు అయితే మేము ఉబయ్ చెప్పే కొన్ని విషయాలను వదిలేస్తూ ఉంటాము.[4]
ఇదే విధంగా ఇస్తీఆబ్ గ్రంథంలో కూడా ఉంది; ఉమర్ ఇలా అన్నారు: ఉమర్ మా కోసం ఉపన్యాసం ఇచ్చారు వారు ఇలా అన్నారు: “అలీ(అ.స) మనలో తీర్పు విషయంలో ఎక్కువ జ్ఞానం కలిగివున్నవారు. మరియు ఉబయ్ మనలో ఖిరాఅత్ (ఖుర్ఆన్ పఠించడం) లో ఎక్కువ జ్ఞానం కలిగివున్నవారు. అయితే మేము ఉబయ్ చెప్పే కొన్ని విషయాలను వదిలేస్తూ ఉంటాము”.[5]
తారీఖె ఇస్లాం గ్రంథంలో కూడా ఇబ్నె అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారం ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ ఇలా అన్నారు: “అలీ(అ.స) తీర్పు విషయంలో మనందరి కన్నా ఎక్కువ జ్ఞానం కలిగివున్నవారు”.[6]
రిఫరెన్స్
1. ఫత్హుల్ బారీ, భాగం8, పేజీ167. اقضى أُمّتی على بن أبی طالب
2. సహీ బుఖారీ, తఫ్సీరె సూరయె బఖరహ్, బాబు ఖౌలిహి “ماننسخ من آیة أوننسها نأت بخیر منها أومثلها”
3. తబఖాతుల్ కుబ్రా, భాగం2, పేజీ285.
4. తబఖాతుల్ కుబ్రా, భాగం2, పేజీ325.
5. ఇస్తీఆబ్, భాగం1, పేజీ68. أقضانا على، و أقرؤنا أبىّ، و إنا لنترک أشیاء من قراءة أبىّ
6. తారీఖె ఇస్లాం, భాగ3, పేజీ193.
https://www.makaremshirazi.net/maaref/fa/article/index/325122/اعتراف-عمربن-خطّاب-به-برتری-علی(ع)-در-قضاوت
వ్యాఖ్యానించండి