ముబాహలహ్ రోజు ఆమాల్

మంగళ, 09/04/2018 - 12:25

క్రైస్తవులు ఇస్లాం ముందు పరాజయం చెంది సంధికి దిగిన రోజు. ఇది ఎవరూ నిరాకరించలేని యదార్ధం.

ముబాహలహ్ రోజు ఆమాల్

జిల్ హిజ్ మాసం యొక్క 24వ తేదిన మబాహలహ్ రోజు. ఈ రోజున దైవప్రవక్త[స.అ] ఇమామ్ అలీ[అ.స], హజ్రత్ ఫాతెమా జహ్రా[అ.స], ఇమామ్ హసన్[అ.స] మరియు ఇమామ్ హుసైన్[అ.స]లను తనతో పాటు తీసుకొని క్రైస్తవులతో ముబాహలహ్ చేయడానికి వెళ్ళారు. ఆ రోజు క్రైస్తవులు అపజయానికి పాలయ్యి దైవప్రవక్త[స.అ]తో సంధికి సిద్ధమయ్యారు. ఇదే రోజున ఇమామ్ అలీ[అ.స] రుకూలో ఉండగా ఒక యాచకుడికి ఉంగరాన్ని ప్రసాదించారు.
మరి ఆరోజు చేయవలసిన కొన్ని ప్రత్యేక ప్రార్థనలు ఉన్నాయి. అవి:
1. గుస్ల్ స్లానం
2. ఉపవాసం దీక్ష
3. రెండు రక్అత్ల నమాజ్; జోహ్ర్ సమయం కన్నా అర గంట ముందు రెండు రక్అత్ నమాజ్ ను చదవాలి. దాని పద్దతి: ప్రతీ రక్అత్ లో “అల్ హంద్” సూరహ్ తరువాత “తౌహీద్ సూరహ్”, “ఆయతల్ కుర్సీ”, మరియు “ఖద్ర్ సూరహ్”లను పది పది సార్లు చదవాలి.
4. దుఆయే ముబాహలహ్ ను చదవాలి.
5. జియారతే జామెఅహ్.[మఫాతీహుల్ జినాన్, పేజీ491-497].

రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాస్ ఖుమ్మీ, మఫాతీహుల్ జినాన్, మతర్జిమ్ ఇలాహీ ఖుమ్షెయి, ఇంతెషారాతె ఉస్వహ్, 1379.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 27