వాజిబాతె నమాజ్

గురు, 10/04/2018 - 05:49

ఆయతుల్లాహ్ సీస్తానీ[అల్లాహ్ అతనిని కాపాడుగాక] తౌజీహుల్ మసాయిల్ ప్రకారం నమాజ్ లో కొన్ని తప్పకుండా చేయవలసిన చర్యలు ఉన్నాయి. వాటి వివరణ.

వాజిబాతె నమాజ్

వాజిబాతె నమాజ్ ల నుండి ఏ ఒక్కటి కూడా ఉద్దేశపూర్వకంగా అమలు పరచకపోతే అతడి నమాజ్ వ్యర్ధమవుతుంది. 11 వాజిబాతె నమాజ్ ఉన్నాయి; అవి:
1. నియ్యత్ అనగా అల్లాహ్ సామిప్యం కోసం – పజ్ర్, జోహ్ర్, అస్ర్, మగ్రిబ్ లేదా ఇషాఁ- నమజ్ చేస్తున్నాను అను మనసులో అనుకోవడం లేదా నోటితో చెప్పడం.
2. ఖియామ్ అనగా నిలబడడం.
3. తక్బీరతుల్ ఎహ్రామ్ అనగా అల్లాహు అక్బర్ చెప్పడం.
4. రుకూ అనగా శరీరాన్ని ముందుకు వంచడం.
5. సుజూద్ అనగా సాష్టంగం
6. ఖిరాఅత్ అనగా సూరహ్ లు చదవడం
7. జిక్ర్ అనగా రుకూ, సజూద్ మొదలు వాటిలో చదివే స్మరణ
8. తషహ్హుద్ అనగా రెండవ రక్అత్ రెండవ సజ్దహ్ మరియు చివరి రక్అత్ లో సలామ్ ముందు చదివేది
9. సలామ్ అనగా నమాజ్ చివరిలో చదివేది
10. తర్ తీబ్ అనగా క్రమంగా చేయడం
11. మువాలాత్ అనగా మధ్యలో అంతరాయం లేకుండా ఒకటి తరువాత ఒకటి చేసుకుంటూ వెళ్ళడం.
ఇందులో కొన్నింటిని “రుక్న్”(మూలం) అంటారు అవి ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా అమలు చేకపోతే నమాజ్ బాతిల్ అవుతుంది.[తౌజీహుల్ మజాయిల్, పేజీ175]

రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ఫార్సీ అనువాదం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 39