ఆయతుల్లాహ్ సీస్తానీ[అల్లాహ్ అతనిని కాపాడుగాక] తౌజీహుల్ మసాయిల్ ప్రకారం అర్కానె నమాజ్ యొక్క వివరణ.
నమాజ్ లో కొన్నింటిని పాటించడం వాజిబ్ గా నిర్ధారించబడి ఉంది మరి కొన్నింటిని ముస్తహబ్ గా. వాజిబ్ కన్నా ఎక్కువ ప్రాధన్యత ఉన్న కొన్ని అంశాలు కూడా ఉన్నాయి అవి వాజిబాతె నమాజ్ అయిన ఈ 11 అంశాలలోనే ఉన్నాయి. ముందుగా ఆ 11 అంశాలును తెలుసుకుందాం: 1. నియ్యత్ 2. ఖియామ్ 3. తక్బీరతుల్ ఎహ్రామ్ 4. రుకూ 5. సుజూద్ 6. ఖిరాఅత్ 7. జిక్ర్ 8. తషహ్హుద్ 9. సలామ్ 10. తర్ తీబ్ 11. మువాలాత్ ఇవి వాజిబాతే నమాజ్. ఇందులో కొన్నింటిని “రుక్న్”(మూలం) అంటారు. అవి ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా అమలు చేయకపోతే నమాజ్ బాతిల్ అవుతుంది. కాని వాజిబాతే నమాజ్ లో మిగిలిన 6 అంశాలు అనుకోకుండా అమలు చేయకపోతే అనగా మరిచిపోతే నమాజ్ బాతిక్ కాదు.
అర్కానె నమాజ్:
1. నియ్యత్
2. తక్బీరతుల్ ఎహ్రామ్
3. రుకూతో కలిసి ఉన్న ఖియామ్ అనగా రుకూ కు వెళ్ళకు ముందు నిలబడడం
4. రుకూ
5. ఒక రక్అత్ లో ఉండే రెండు సంజ్దాలు.[తౌజీహుల్ మజాయిల్, పేజీ175]
రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ఫార్సీ అనువాదం.
వ్యాఖ్యానించండి