సఫర్ మాసం యొక్క సందర్భాలు

బుధ, 10/10/2018 - 10:15

ఇస్లామీయ క్యేలండర్ ప్రకారం “సఫర్” రెండవ మాసం. ఈ మాసంలో జరిగిన ఇస్లామీయ ముఖ్య సంఘటనల వివరణ.

సఫర్ మాసం యొక్క సందర్భాలు

1వ తారీఖు: హిజ్రీ యొక్క 37వ సంవత్సరంలో సిఫ్ఫీన్ యుద్ధం జరిగింది. హిజ్రీ యొక్క 61వ సంవత్సరంలో కర్బలా బంధీలు ‘షామ్’ చేరుకున్నారు.
2వ తారీఖు: హిజ్రీ యొక్క 61వ సంవత్సరంలో కర్బలా బందీలను యజీద్ సభకు ప్రవేశపెట్టారు.
3వ తారీఖు: హిజ్రీ యొక్క 121వ సంవత్సరంలో ఇమామ్ జైనుల్ ఆబెదీన్[అ.స] కుమారుడైన జనాబె ..జైద్.. మరణించారు. హిజ్రీ యొక్క 57వ సంవత్సరంలో ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] జన్మించారు.
4వ తారీఖు: హిజ్రీ యొక్క 61వ సంవత్సరంలో రుఖయ్యహ్(సకీనహ్) బింతుల్ హుసైన్[అ.స] మరణించారు.
7వ తారీఖు: హిజ్రీ యొక్క 128వ సంవత్సరంలో ఇమామ్ మూసా కాజిమ్[అ.స] జన్మించారు. షేఖ్ ముఫీద్[ర.అ] ఉల్లేఖన ప్రకారం ఇమామ్ హసన్[అ.స] మరణించిన రోజు. హిజ్రీ యొక్క 1411వ సంవత్సరంలో గొప్ప ధర్మవేధి ఆయతుల్లాహ్ “మరషీ నజఫీ”[ర.అ] మరణించారు.
8వ తారీఖు: హిజ్రీ యొక్క 35వ సంవత్సరంలో “జనాబె సల్మానె ముహమ్మదీ ఫార్సీ” మరణించారు. హిజ్రీ యొక్క 1413వ సంవత్సరంలో ఆయతుల్లాహ్ “అబుల్ ఖాసిం ఖుయీ”[ర.అ] మరణించారు.
9వ తారీఖు: హిజ్రీ యొక్క 37వ సంవత్సరంలో సిఫ్ఫీన్ యుద్ధంలో జనాబె “అమ్మారె యాసిర్” మరియు “ఖుజైమహ్ ఇబ్నె సాబిత్” మరణించారు. హిజ్రీ యొక్క 38వ సంవత్సరంలో “నెహర్వాన్” యుద్ధం జరిగింది.
12వ తారీఖు: ప్రవక్త మూసా[అ.స] యొక్క సోదరుడూ, ఉత్తరాధికారి అయిన “హారూన్” మరణించారు.
13వ తారీఖు: హిజ్రీ యొక్క 303వ సంవత్సరంలో అహ్లె సున్నత్ మూల గ్రంథ రచయిన “నిసాయి” మరణించారు.
17వ తారీఖు: ఒక రివాయత్ ప్రకారం హిజ్రీ యొక్క 203వ సంవత్సరంలో ఇమామ్ అలీ రిజా[అ.స] మరణించారు.
20వ తారీఖు: అర్బయీన్ హుసైనీ, అహ్లెబైత్[అ.స] తిరిగి కర్బలాకి వచ్చారు. “జాబిర్ ఇబ్నె అబ్దిల్లాహె అన్సారీ” ఇమామ్ హుసైన్[అ.స] సమాధి దర్శనానికి వచ్చారు.
28వ తారీఖు: హిజ్రీ యొక్క 11వ సంవత్సరంలో దైవప్రవక్త[స.అ] మరణించారు. 50వ సంవత్సరంలో ఇమామ్ హసన్[అ.స] మరణించారు.
30వ తారీఖు: హిజ్రీ యొక్క 203వ సంవత్సరంలో ఇమామ్ అలీ రిజా[అ.స] మరణించారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18