రబీవుల్ అవ్వల్ యొక్క సందర్భాలు

మంగళ, 11/28/2017 - 04:43

.ఇస్లామీయ కేలండర్ ప్రకారం రబీవుల్ అవ్వల్ మూడవ మాసం. ఈ మాసంలో సంభవించిన కొన్ని చారిత్రాత్మిక సంఘటనల సూచిక.

రబీవుల్ అవ్వల్ యొక్క సందర్భాలు

1వ తారీఖు: దైవప్రవక్త[స.అ] యొక్క హిజ్రత్(మక్కా నుండి మదీనహ్ ప్రయాణం) మొదలు పెట్టిన రోజు.
3వ తారీఖు: యజీద్ ఆదేశం ప్రకారం కాబా పై దాడి చేయబడిన రోజు.(యజీద్ చావుకు 11 రోజులు ముందు).
5వ తారీఖు: ఇమామ్ హుసైన్[అ.స] యొక్క కుమార్తె హజ్రత్ సకీన మరణించిన రోజు
8వ తారీఖు: ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] విషప్రయోగం ద్వార చంపబడిన రోజు.
9వ తారీఖు: దైవప్రవక్త[స.అ] యొక్క అంతిమ ఉత్తరాధికారి హజ్రత్ ఇమామ్ మహ్‍దీ[అ.స] యొక్క ఇమామత్ మరియు ఖిలాఫత్ పదవీ స్వీకరణ రోజు. షియాల సంతోషకరమైన రోజు. “షేఖ్ అబ్బాసె ఖుమ్మి” పుస్తకం “మఫాతీహుల్ జినాన్”లో ఈ రోజు పెద్ద పండగ రోజు అని సూచించబడి ఉంది.
10వ తారీఖు: జనాబె ఖదీజతుల్ కుబ్రా(అ.స)తో దైవప్రవక్త[స.అ] వివాహం జరిగిన రోజు.
12వ తారీఖు: ఒక ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త[స.అ] జన్మించిన రోజు.
17వ తారీఖు: దైవప్రవక్త ముహమ్మద్[స.అ] మరియు వారి 6వ ఉత్తరాధికారి అయిన ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] జన్మించిన రోజు.[అల్ మురాఖిబాత్, పేజీ61]

రిఫ్రెన్స్
మీర్జా జవాద్ ఆగా మలికీ తబ్రేజీ, అల్ మురాఖిబాత్.(రబీవుల్ అవ్వల్ మాసం గురించి వివరణ ఉన్న అధ్యాయంలో).

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 23